
మాజీ హీరోయిన్ ప్రియమణికి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. ‘ఫ్యామిలీ మెన్’తో ఆమె కెరీర్ కు మళ్ళీ ఊపు వచ్చింది. నిజానికి ప్రియమణి టాలెంటెడ్ నటి. ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డ్ పొందిన నటి. కానీ కాలం కలిసి రాక, ప్రియమణికి స్టార్ డమ్ దక్కలేదు. పైగా హీరోయిన్ గానూ ఎక్కువ కాలం ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది.
కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకు మంచి రోల్స్ వస్తున్నాయని, హీరోయిన్ గా చేసిన తప్పులను ఇప్పుడు చేయదలచుకోలేదని ప్రియమణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ.. పనిలో పనిగా తన డ్రీమ్ రోల్ గురించి కూడా వివరించింది. ఆల్ టైమ్ బ్యూటీ రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’ తరహా పాత్రను చెయ్యాలని తానూ కొన్నేళ్ళుగా కలలు కంటున్నాను అని, కానీ ఎవ్వరూ నాకు ఆ అవకాశం ఇవ్వలేదని ఆమె తెలియజేసింది.
అయితే తను అలాంటి పాత్రలకు పర్ఫెక్ట్ అంటూ ప్రియమణి అభిప్రాయపడుతోంది. ఆమె మాటల్లోనే ‘నా బాడీ లాంగ్వేజ్, నా డైలాగ్ డెలివరీ పొగరుబోతు పాత్రలకు కరెక్ట్ గా సరిపోతుంది. అందుకే, అలాంటి నీలాంబరి పాత్ర కోసం నేను చాలా సంవత్సరాలుగా ఆశతో ఎదురు చూస్తున్నాను. మరి అలాంటి పాత్ర నాకు ఎప్పుడు వస్తోందో చూడాలి. అలాగే, నాకు ఎప్పటికైనా పూర్తి స్థాయి విలన్ గా నటించాలని కూడా ఉంది. నా కోరిక నన్ను నిద్ర కూడా పోనివ్వడం లేదు. అయితే నా కోరికలో నిజాయితీ ఉంది, నెరవేరుతుంది’ అని ప్రియమణి వెల్లడించింది.
ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియమణి బెంగళూరులోనే సెటిల్ అయింది. అన్నట్టు గతంలో తనని ‘కర్ర ఆంటీ’, ‘ఫ్యాట్ పిగ్’ అని కొందరు ఆకతాయిలు ఆన్ లైన్లో వేధించారనే విషయాన్ని ప్రియమణి చెప్పడం, ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం తెలిసిందే. ఏది ఏమైనా ప్రియమణిని ఫ్యాట్ పిగ్ అంటూ ట్రోలింగ్ చేయడం దారుణం. ప్రియమణికి రంకు తక్కువ అయినా, తన అందచందాలతో అప్పట్లో ఓ ఊపు ఊపింది.