https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఆ లేడీ కంటెస్టెంట్ తో దుబాయ్ చెక్కేయనున్న యావర్… పర్సనల్ మేటర్ లీక్ చేసిన శివాజీ!

శివాజీ ప్రోత్సాహంతో ప్రశాంత్, యావర్ ఫినాలే వరకు వచ్చారు అని స్పై ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే అప్పట్లో రతికతో పులిహోర కలపడం తో ప్రశాంత్ ఇమేజ్ డ్యామేజ్ అయింది.

Written By: , Updated On : December 17, 2023 / 08:58 AM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 లో స్పై బ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉంటూ మంచి బంధం ఏర్పరుచుకున్నారు. వీరి అమూల్యమైన స్నేహానికి బిగ్ బాస్ ప్రేక్షకులు అభిమానులయ్యారు. వీరికి సెపరేట్ గా ఉండే ఫ్యాన్స్ కంటే కూడా ఈ గ్రూప్ కోసం చూసే అభిమానులు ఎక్కువ. అయితే మొదట్లో ప్రశాంత్, యావర్ లను అందరూ టార్గెట్ చేయడంతో శివాజీ వారికి అండగా నిలిచాడు. దీంతో వారి మధ్య బాండింగ్ ఏర్పడింది.

శివాజీ ప్రోత్సాహంతో ప్రశాంత్, యావర్ ఫినాలే వరకు వచ్చారు అని స్పై ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే అప్పట్లో రతికతో పులిహోర కలపడం తో ప్రశాంత్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఒక పక్క ప్రశాంత్ తో క్లోజ్ గా ఉంటూనే వెన్నుపోటు పొడిచింది రతిక. పైగా యావర్ తో మరో లవ్ ట్రాక్ నడిపింది. దీంతో రతిక పై సోషల్ మీడియాలో నెగిటివిటీ వచ్చింది. ఈ కారణంగానే ఆమె అనుకోకుండా నాలుగో వారంలో ఎలిమినేట్ అయిపోయింది.

కానీ రతికకు రీ ఎంట్రీ ద్వారా మరో అవకాశం లభించింది. గతంలో రతిక ఇచ్చిన షాక్ తో ప్రశాంత్ ఆమెకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో రతికను అక్క అని పిలవడం మొదలుపెట్టాడు. కానీ యావర్ మాత్రం ఆమెతో చాలా క్లోజ్ గా ఉన్నాడు. యావర్ జర్నీ వీడియో లో కూడా ఇద్దరికి లవ్ ట్రాక్ వేశారు. అయితే తాజాగా శివాజీ వీరిద్దరి గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు. యావర్, శివాజీ, ప్రశాంత్ బెడ్ రూంలో కూర్చొని మాట్లాడుకున్నారు.

యావర్ మాటలకు బిగ్ బాస్ స్పందించారు. ఏంటి యావర్ రతిక లా మాట్లాడుతున్నారు .. అలాగే ఆలోచిస్తున్నారు అని బిగ్ బాస్ అడిగారు. దీంతో ముగ్గురూ నవ్వుకున్నారు. తర్వాత నేనేం చేశాను అంటూ యావర్ అమాయకంగా శివాజీని అడిగాడు. హౌస్ లో నువ్వు చేసే విన్యాసాలు నాకేం తెలుసు అని శివాజీ అన్నాడు. వైర్ అంటే ఏంటి అని శివాజీ అడిగాడు. వెంటనే యావర్ అది నేను రాస లేదు అని చెప్పాడు. నువ్వు రాస లేదు అయినా కూడా అది జనాల్లోకి వెళ్లింది అన్నాడు శివాజీ. మీరు దుబాయ్ కూడా వెళ్లాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు కదా అంటూ సీక్రెట్ బయట పెట్టాడు. దీంతో యావర్ ఏం చెప్పాలో తెలియక తల దించుకున్నాడు.