Rasi Phalalu Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 17న ఆదివారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో సింహ,తల రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సందర్భంగా 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. అయితే వాటి కోసం కష్టపడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు రావొచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది.
వృషభం:
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. చూట్టూ వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.
మిథునం:
కొన్ని ముఖ్యమైన బాధ్యతలు చేపడుతారు. ఆరోగ్యంలో మార్పులు రావొచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం. కొన్ని పనులు పూర్తి చేయడానికి సహోద్యోగులసాయం తీసుకుంటారు.
కర్కాటకం:
స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఒకరితో వాగ్వాదం ఏర్పడే అవకాశం. విహార యాత్రలలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.
సింహం:
దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ కారణంగా ఆర్థిక బలోపేతం అవుతుంది. వ్యాపారులు పెట్టుబడి విషయంలో పెద్దల సలహాలు తీసుకోవాలి.
కన్య:
పెండింగులో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
తుల:
ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. సోదరులతో ఉండే వివాదం నేటితో ముగుస్తుంది. రాజకీయ నాయకులు కొన్ని ఆఫర్లు పొందుతారు. ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది.
వృశ్చికం:
కొత్తగా పెళ్లయిన వారు సంతోషంగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. పెట్టుబడి పెట్టిన వారు రెట్టింపు లాభాలు పొందుతారు.
ధనస్సు:
ఈ రాశివారు ఆహ్లదంగా గడుపుతారు. పెండింగులో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. సాయంత్రం పిల్లలతో సంతోషంగా గడుపుతారు.
మకర:
కొన్ని వ్యాధులు ఇబ్బంది పెట్టోచ్చు. ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
కుంభం:
ఇతరులతో వాదనలకు దిగొద్దు. సమస్యలు అధిగమించడానికి గురువుల సాయం తీసుకోవాలి. బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది.
మీనం: ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది.