Tollywood Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఏ మాయ చేసావే చిత్రం విడుదలై నేటితో 12ఏళ్లు గడుస్తున్న సందర్భంగా దీనిపై సమంత భావోద్వేగభరితంగా పోస్ట్ చేసింది. ‘లైట్స్, కెమెరా, యాక్షన్.. 12ఏళ్ల జ్ఞాపకాలు, అనుభవాలు గుర్తుకువస్తున్నాయి. ఈ ప్రయాణం, ప్రపంచంలోనే అత్యంత విధేయత ఉన్న అభిమానులను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.. అవి వేటికీ సరిపోలని క్షణాలు’ అని సమంత పేర్కొంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ రియాలిటీ షో స్టార్ మా లో 5 సిరీస్ లుగా తెలుగు టెలివిజన్ లో పెద్ద సంచలనం. ఈ అద్భుత సంచలనాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేస్తోంది “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”. ఓటీటీలో 24 గంటలు “బిగ్ బాస్” ని అందుబాటులోకి తెస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్”లో నేడు (ఫిబ్రవరి 26 న) సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది.
Also Read: భీమ్లానాయక్‌ను ఎన్ని రోజుల్లో పూర్తి చేశారో తెలిస్తే షాక్ అవుతారంతే..!
ఈ బిగ్ బాస్ ఓటీటీ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. అయితే నేటి నుంచి ప్రేక్షకుల ముందుకు రాన్నున బిగ్ బాస్ ఓటీటీ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి అభ్యంతరాలు తెలిపారు. ఈ షో అధికారిక వ్యభిచార గృహమని..భక్తి రస చిత్రాల్లో నటించిన నాగార్జున బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

తాము ఈ షోకు వ్యతిరేకమని.. తమ పార్టీ ఆధ్వర్యంలో బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు నారాయణ తెలిపారు. మరి నారాయణ కామెంట్స్ పై నాగ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Also Read: భీమ్లానాయక్ వీరావేశం చూడతరమా? ఇందుకే బాక్సాఫీస్ బద్దలు