Chiranjeevi: డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య రూపంలో చిరంజీవికి భారీ హిట్ ఇచ్చారు. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, విన్నర్ గా నిలిచింది. ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మెహర్ రమేష్ మాత్రం ఆయనకు షాక్ ఇచ్చాడు. ఏళ్ల తరబడి డైరెక్షన్ కి నోచుకోని మెహర్ రమేష్ ని నమ్మినందుకు చిరంజీవి భారీ మూల్యం చెల్లించాడు. వేదాళం రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ తీవ్ర నిరాశపరిచింది. ఇకపై రీమేక్స్ చేయవద్దని చిరంజీవి ఫ్యాన్స్ ఆయన్ని వేడుకున్నారు. అంతగా భోళా శంకర్ ఫలితం చిరంజీవిని ప్రభావితం చేసింది.
దాంతో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయాల్సిన బ్రో డాడీ రీమేక్ సైతం ఆయన పక్కన పెట్టేశారు. బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన వ్ వశిష్టకు అవకాశం ఇచ్చాడు. విశ్వంభర టైటిల్ తో సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. కాగా చిరంజీవి యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. మరో రెండు చిత్రాలు లాక్ చేశారు. ఒకటి అనిల్ రావిపూడితో కాగా, మరొకటి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్నారు.
కాగా అనిల్ రావిపూడి మూవీకి సన్నాహాలు మొదలయ్యాయట. సంక్రాంతి పండగను పురస్కరించుకుని, జనవరి 15న పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారట. ఇండస్ట్రీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి జులై నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. అనిల్ రావిపూడికి మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్ గా పేరుంది. ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలాగే ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసే సత్తా ఉన్న డైరెక్టర్.
ఇక అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో చిరంజీవితో ఆయన చేయబోయే మూవీ ఎలా ఉంటుందనే ఆత్రుత అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. కాగా చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల మూవీ ప్రకటన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. మోస్ట్ వైలెంట్ మూవీగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్నాడట. చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ తో సంచలనాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.