Premalu 2 movie cancelled news : గడిచిన రెండు మూడేళ్ళ నుండి విడుదలైన లవ్ స్టోరీస్ లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సంపాదించుకున్న లవ్ స్టోరీ ‘ప్రేమలు'(Premalu). గత ఏడాది మలయాళం లో విడుదలైన ఈ క్యూట్ లవ్ స్టోరీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. దీనిని మళ్ళీ తెలుగు, తమిళ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేసారు. ఈ రెండు భాషల్లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఈ చిత్రం ఉందని ప్రతీ ఒక్కరు ప్రశంసించారు. ఫలితంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. ముఖ్యంగా ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన మమిత బైజు ఇప్పుడు సౌత్ ఇండియా లో ఏ రేంజ్ డిమాండ్ తో కొనసాగుంతుందో మనమంతా చూస్తున్నాము. హీరో కి కూడా మంచి పేరొచ్చింది.
ఈ చిత్రం రన్నింగ్ లో ఉన్నప్పుడే సీక్వెల్ ని ప్రకటించారు మేకర్స్. హీరో, హీరోయిన్ మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది?, దాని వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుందా?, తరుగుతుందా?, ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. రీసెంట్ గానే ఆ చిత్ర దర్శకుడు హీరో హీరోయిన్లకు ఫైనల్ స్క్రిప్ట్ ని వినిపించాడట. కానీ వాళ్లకు ఆ స్క్రిప్ట్ నచ్చలేదట. దీనిని మరో లెవెల్ లో డిజైన్ చేయడం కుదరదని డైరెక్టర్ చెప్పడం తో ఈ సినిమాని పూర్తిగా రద్దు చేసినట్టు తెలుస్తుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లకు ఈ వార్త అత్యంత నిరాశకు గురి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నుండి భవిష్యత్తులో కేవలం ‘ప్రేమలు’ చిత్రాన్ని మాత్రమే బోర్ కొట్టినప్పుడు చూసుకోవాలి,ఈ సినిమా సిరీస్ ముందుకు కదలడం అసాధ్యం అనే చెప్పాలి.
Also Read : ప్రేమలు 2 విడుదల తేదీ వచ్చేసింది..ఈసారి ప్రత్యేక పాత్రలో క్రేజీ టాలీవుడ్ యంగ్ హీరో!
ఈ చిత్రం లో హీరోగా నటించిన నస్లీన్ జి.గఫోర్ కి మలయాళం లో మామూలు రేంజ్ డిమాండ్ లేదు. రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన ‘జింఖానా’ చిత్రం కమర్షియల్ గా మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ చిత్రాన్ని తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ హీరో కి ఇప్పుడు మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రేమలు సీక్వెల్ లో నటించడానికి హీరోయిన్ మమిత బైజు కి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, నస్లీన్ కి మాత్రం స్క్రిప్ట్ నచ్చలేదట. అందుకే ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కిందని మాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త.