Prema Vimanam Review: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఏ అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తాయి..కొన్ని సినిమాలు ప్రేక్షకుడి లో ఏదో ఒక ఆలోచనలను రేకెత్తించేలా ఉంటూ ఆ సినిమా అయిపోయిన తరువాత కూడా ఇంటికి వచ్చిన ఆడియెన్స్ ని కొన్ని భావోద్వేగాలు మాత్రం ఒకరోజు వరకు వెంటాడుతూనే ఉంటాయి అంతటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే శక్తి ఒక సినిమాకి మాత్రమే ఉంది. అలాంటి సినిమా ఇండస్ట్రీలో వారానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫట్ అవుతాయి అయితే ఈవారం కూడా ఓటిటి ప్లాట్ ఫారం లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా జీ 5 లో రిలీజ్ అయిన సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన సినిమా ప్రేమ విమానం… ఈ సినిమా ఏ అంచనాలు లేకుండా డైరెక్ట్ గా జీ 5 లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా లో హీరోగా నటించిన సంగీత్ శోభన్ ఇప్పటికే మాడ్ అనే సినిమాలో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఈ కుర్ర హీరో సంతోష్ శోభన్ వాళ్ల తమ్ముడు కావడం విశేషం. ఇక ఇప్పటికే మాడ్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న సంగీత్ శోభన్ ప్రస్తుతం ప్రేమ విమానం అనే సినిమాతో ఎంతవరకు మెప్పించాడు అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
ముందుగా ఈ సినిమా కథలోకి వెళ్తే 1990 బ్యాక్ డ్రాప్ లోని కథ తో తెరకెక్కింది ఈ సినిమా ఒక గ్రామంలో పేదవారు గా ఉన్న శాంతమ్మ( అనసూయ) ,నాగరాజు (రవి వర్మ) అనే దంపతులకు ఉన్న ఇద్దరు పిల్లలు అయిన రాము,లక్ష్మణ్ అలియాస్ లచ్చు అనే పిల్లలతో సాగే సినిమా.. పూటగడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నా శాంతమ్మ దంపతుల కొడుకు లచ్చుకి విమానం ఎక్కాలని ఆశ ఉంటుంది. అయితే అప్పటికే నాగరాజు దంపతులు విపరీతమైన అప్పులు చేసి అప్పుల బాధల్లో కూరుకుపోయిన పరిస్థితిలో చావ లేక బతుకుతున్న పరిస్థితుల్లో ఉండిపోతారు. ఇలాంటి క్రమంలో తన కొడుకు విమానం ఎక్కాలని తండ్రి దగ్గర తన కోరిక వ్యక్తపరచడంతో ఆయన కొద్ది రోజుల్లోనే విమానం ఎక్కుదామని కొడుకుతో చెప్పి అతని కోరికను నెరవేర్చాలని అనుకుంటాడు. కానీ తర్వాత నాగరాజు అప్పుల భాదతో ఉరి వేసుకుని చనిపోతాడు. దాంతో శాంతమ్మ తన పిల్లల్ని కూలి పని చేసుకుంటూ సాడుకుంటు వస్తుంది.
వాళ్ల పిల్లల్ని ఉన్నదాంతో బాగా చూసుకుంటుంది. ఇక ఇంకో గ్రామంలో మని (సంగీత్ శోభన్) అనే కుర్రాడు ఆ ఊరి సర్పంచ్ కూతురు అయిన అభిత(శాన్వి మేఘన) ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని చూస్తారు. దాంట్లో భాగంగానే వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళకు చెబితే వాళ్ల పెళ్లికి ఒప్పుకోరు అనే ఉద్దేశ్యం తో వీళ్ళకి వీళ్ళు ఒక డిసిషన్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. ఇక వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు చేరుకుందా, శాంతమ్మ కొడుకు అయిన లచ్చు విమానం ఎక్కడా లేదా అనే కథంశం తో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది…
అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒక్కసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా మనం తెలుసుకుందాం…
ముందుగా దర్శకుడు సంతోష్ ఈ సినిమాని తీయడం పట్ల ఆయనకు సినిమా అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనే దానిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ ని అందించాడనే చెప్పాలి. 1990 బ్యాక్ డ్రాప్ ని ఎంచుకొని అప్పటి మూడ్ ని క్రియేట్ చేస్తూ సినిమాను చూసే ప్రతి ఒక్కరికి 1990 తాలూకు బ్యాక్ డ్రాప్ లో మనం ఉన్నాం అని అనుకునేలా ప్రతి ప్రేక్షకుడిని సినిమాలో ఇన్వాల్వ్ చేయగలిగాడు ఈ విషయం లో ముందు గా మనం డైరెక్టర్ సంతోష్ ని మెచ్చుకోవచ్చు…
ఇక ఈ సినిమాలో నటించిన సంగీత్ శోభన్ గాని, శాన్వి మేఘన అలాగే అనసూయ భరద్వాజ్, రవివర్మ, వెన్నెల కిషోర్ చిన్న పిల్లలు అయిన అభిషేక్ నామా, దేవన్ష్ నామా లాంటి నటులు వాళ్ల పరిధి మేరకు నటించారు. అయితే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ని ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే ఆయన క్యారెక్టర్ అనేది సినిమాకి చాలా ప్లస్ అయ్యేది.ఇక దర్శకుడు ప్రతి ఫ్రేమ్ లో కూడా తన ఇంటెన్సీని చూపిస్తూ కథకి ఏ ఇబ్బంది కలగకుండా కథని డైరెక్టర్ డామినేట్ చేయకుండా, డైరెక్టర్ ను కథ డామినేట్ చేయకుండా ఇద్దరికీ సమానంగా క్రెడిట్ ఇస్తూ సినిమాని బాగా తీశాడు…
ఇక ఈ సినిమా కి సినిమాటోగ్రాఫర్ అయిన జగదీష్ చీకటి కూడా తన కెమెరాతో 1990 నాటి బ్యాక్ డ్రాప్ ని చాలా అద్భుతంగా చూపించాడు.అలాగే ఎక్కడ కూడా సినిమాకి అనవసరమైన షాట్స్ ని వాడకుండా డీసెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఒక డీసెంట్ సినిమాటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనూప్ రూబెన్స్ ఇంతకుముందు చాలా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. అయినప్పటికి ఈ సినిమాలో సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోనప్పటికీ బిజీఎం మాత్రం కొంత వరకు పర్లేదు అనిపించింది. ఇక ఎడిటర్ విషయానికి వస్తే అమర్ రెడ్డి కూడా తన పనితనాన్ని చూపించాడు కొన్ని సీన్లు లాగైనప్పటికీ ముఖ్యమైన సీన్లలో మాత్రం చాలా షార్ప్ ఎడిటింగ్ చేసి సినిమా కి బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడం లో కీలక పాత్ర వహించాడు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా వర్క్ చేసినట్టుగా కనిపిస్తుంది.అందుకే సినిమా అవుట్ పుట్ అనేది మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది.ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్న పరిధిలో చాలా బాగున్నాయి…
ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే హీరో సంగీత్ శోభన్ యాక్టింగ్ అనే చెప్పాలి. ఈయన ఫ్యూచర్ లో మంచి నటుడు అవుతాడు.ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే చాలా సినిమాల అనుభవం ఉన్న నటుడి గా నటించి మెప్పించాడు….అలాగే అనసూయ గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగుంది అలాగే స్టోరీ కూడా బాగుంది…
అయితే ఈ సినిమా లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసిన డైరెక్టర్ వాటిని ఫుల్ లెంత్ క్యారెక్టర్ లుగా వాడుకోలేదు. డైరెక్టర్ కథలో ఉన్న డెప్త్ ని డైరెక్షన్ లో బాగా చూపించినప్పటికి ఇంకా కొంచం బాగా చూపించి ఉంటే బాగుండేది.ఇక మ్యూజిక్ ఇంకొంచెం బాగుంటే సినిమా ఎలివేట్ అయ్యేది…
మొత్తానికి ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రం బాగానే ఆకట్టుకుంటుంది.ఇక టైముంటే ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ జీ 5 లో ఈ సినిమాని ఒకసారి చూడచ్చు.
ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2.5/5
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Prema vimanam movie review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com