Preetham Jukalker: స్టార్ హీరోయిన్ సమంత విడాకులకు ప్రధాన కారణం ఆమె స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ అని చాలా ఆరోపణలు వచ్చాయి. వారిద్దరూ సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను చూపెట్టి మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్ లో ట్రోల్స్ కూడా చేశారు. కొన్ని యూట్యూబ్ చానెల్స్ పై సమంత కోర్టుకు కూడా ఎక్కింది. ఇక సమంత తనకు అక్క అని తాను అలానే పిలుస్తానని ప్రీతమ్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

టాలీవుడ్ కపుల్ సమంత-నాగచైతన్య విడాకుల విషయంలో ప్రముఖంగా వినిపించిన ప్రీతమ్ జుకాల్కర్ పేరు తాజాగా మరోసారి ప్రస్తావనకు వచ్చింది. మెగా డాటర్ శ్రీజ కల్యాణ్ బర్త్ డే రోజున ఆమె పెట్టిన పోస్ట్ పై ప్రీతమ్ ఆసక్తికర కామెంట్ చేశాడు. దీంతో ప్రీతమ్ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
శ్రీజ తనకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తన ఫొటోతో పోస్ట్ షేర్ చేసింది. దీనికి ప్రీతమ్ ‘సుందర్ లడికీ’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో నెటిజన్ల ఫోకస్ ప్రీతమ్ కామెంట్ పై పడింది.
Also Read: Kaikala Satyanarayana: కైకాల ఆరోగ్యం విషమం.. ఆసుపత్రిలో చికిత్స!
చూస్తుంటే ప్రీతమ్ సమంతకు మాత్రమే కాదు.. టాలీవుడ్ కు చెందిన పలువురికి కూడా డిజైనర్ గా పనిచేశాడు కావచ్చని తెలుస్తోంది. సమంతతో పాటు మెగా ఫ్యామిలీకి కూడా ప్రీతమ్ తెలుసు కావచ్చు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
Also Read: Godfather: చిరుకు చెల్లెలిగా నటించడానికి నయనతార ఎంత డిమాండ్ చేసిందో తెలుసా?