
Upasana – Ram charan : ఉపాసన-రామ్ చరణ్ వారసులను ఇవ్వాలనేది ప్రతి ఒక మెగా అభిమాని కల. కుటుంబ సభ్యుల కంటే మిన్నగా ఆ రోజు కోసం ఎదురు చూశారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత వారి కల ఫలించింది. ఉపాసన గర్భం దాల్చారన్న వార్త ఎక్కడలేని సంతోషంలో ముంచేసింది. గత ఏడాది డిసెంబర్ నెలలో చిరంజీవి ఈ మేరకు ప్రకటన చేశారు. ఆ ఆంజనేయుడి ఆశీస్సులతో రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆయన ట్వీట్ చేశారు.
కాగా కొద్ది నెలల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఉపాసన అమెరికాలో ప్రసవించనున్నారని ఓ ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఉపాసన ఖండించారు. తన డెలివరీ ఇండియాలో అపోలో హాస్పిటల్స్ లో జరుగుతుంది అంటూ ఆమె స్పష్టం చేశారు. కాగా ఉపాసనకు పుట్టబోయే బిడ్డపై మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ దంపతుల జాతకం ప్రకారం అబ్బాయి పుడితే కుటుంబ కీర్తి మరింత పెరుగుతుందట. స్టార్ గా రామ్ చరణ్, బిజినెస్ ఉమన్ గా ఉపాసన ఉన్నత శిఖరాలకు వెళతారట.
అదే అమ్మాయి పుట్టిన పక్షంలో ఇబ్బందులు తప్పవట. రామ్ చరణ్ దంపతులను సమస్యలు చుట్టుముడతాయని అంటున్నారు. అయితే ఇదంతా ట్రాష్ అంటూ మెగా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. అమ్మాయైనా అబ్బాయైనా రామ్ చరణ్ దంపతులు ఆనందంగా స్వీకరిస్తారు. ఇక జాతకాలు వాటి ఫలితాలు మూఢనమ్మకాలని ఖండిస్తున్నారు. ఇన్నేళ్లకు మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ వస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. అది చాలు అంటున్నారు.
ప్రస్తుతం ఉపాసన దంపతులు దుబాయ్ టూర్ లో ఉన్నారు. అక్కడ ఉపాసన సీమంతం నిర్వహించడం విశేషం. త్వరలో వీరు ఇండియా రానున్నారు. హైదరాబాద్ లో ఇరు కుటుంబాల బంధువుల సమక్షంలో గ్రాండ్ గా సీమంత వేడుక నిర్వహించనున్నారని సమాచారం. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యాభై శాతానికి పైగా చిత్రీకరణ జరుపుకుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. మ్యూజిక్ అందిస్తున్నారు.