Prashanth Varma: ఒక సినిమాకి డైరెక్షన్ చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. సినిమా కథకి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ఉండాలి. 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి. వాళ్ళందరి చేత పని చేయించుకునే కెపాసిటి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే సినిమాని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద చూపించగలుగుతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు సైతం హనుమాన్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించి ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకున్నాడు. అలాంటి దర్శకుడు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చూస్తున్నప్పటికి వాళ్ళు అతనికి డేట్స్ అయితే ఇవ్వడం లేదు. కారణమేంటంటే గతంలో ఆయన బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి మధ్యలోనే వదిలేశాడు. దాంతో స్టార్ హీరోలు సైతం అతన్ని నమ్మడం లేదు. కారణం ఏంటి అంటే తమ సినిమాను కూడా మధ్యలో వదిలేసి వెళ్తే ఎవరు బాధ్యత వహిస్తారనే ఉద్దేశ్యంతోనే అతన్ని ఎవ్వరు నమ్మడం లేదట.
కొంతమంది స్టార్ హీరోలను కలిసి కథలను వినిపించినప్పటికి వాళ్ళు కథలు బాగున్నాయని చెబుతున్నారట. కానీ తనకు మాత్రం డేట్స్ కేటాయించట్లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ప్రస్తుతం రిషబ్ శెట్టిని హీరోగా పెట్టి ‘జై హనుమాన్’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి స్టార్ హీరో తో సినిమా చేయాలనే ఆలోచనలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే జై హనుమాన్ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుందా?లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక బాలయ్య బాబు కొడుకును ఇంట్రడ్యూస్ చేసినట్టయితే అతనికి మంచి క్రేజ్ అయితే దక్కేది.
దాంతోపాటుగా ఆ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలిపినట్టైతే స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయడానికి క్యూ కట్టేవారు. అలా కాకుండా తను అర్ధాంతరంగా ఆ సినిమాని వదిలేయడంతో బాలయ్య బాబు సైతం అతని మీద సీరియస్ అయ్యాడు. అందువల్లే అతనికి ఇండస్ట్రీలో పెద్దగా స్టార్ హీరోలైతే స్పందించడం లేదనే వార్తలు వస్తున్నాయి…