Prashanth Varma: హనుమాన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ… అయోధ్య మందిర ప్రాణ ప్రతిష్ట రోజే!

దేశవ్యాప్తంగా హనుమాన్ చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మను పలువురు చిత్ర ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ చిత్రానికి సీక్వెల్ ఉందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే వెల్లడించారు. సీక్వెల్ పేరు జై హనుమాన్.

Written By: S Reddy, Updated On : January 23, 2024 10:55 am
Follow us on

Prashanth Varma: బాక్సాఫీస్ వద్ద హనుమాన్ సంచలన జర్నీ కొనసాగుతుంది. వరల్డ్ వైడ్ హనుమాన్ రూ. 200 కోట్ల వసూళ్లకు దగ్గరైంది. ఇది ఊహించని విజయం అని చెప్పాలి. కేవలం రూ. 22 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసిన హనుమాన్ వందల కోట్ల వసూళ్లతో భారీ లాభాలు తెచ్చిపెట్టింది. హీరో తేజ సజ్జాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ప్రయోగం ఫలించింది. తక్కువ బడ్జెట్ తో అదిరిపోయే విజువల్స్ తో హనుమాన్ తెరకెక్కింది. ఓ సూపర్ హీరో కథలో లార్డ్ హనుమాన్ ఎంట్రీ చక్కగా కుదిరింది.

దేశవ్యాప్తంగా హనుమాన్ చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మను పలువురు చిత్ర ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ చిత్రానికి సీక్వెల్ ఉందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే వెల్లడించారు. సీక్వెల్ పేరు జై హనుమాన్. అయితే జై హనుమాన్ లో తేజ సజ్జా హీరో కాదని ప్రశాంత్ వర్మ స్పష్టత ఇచ్చారు. తేజ సజ్జా ఒక పాత్రలో కనిపిస్తాడు. హనుమాన్ గా ఒక స్టార్ హీరో నటిస్తాడని అన్నారు.

కాగా జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రశాంత్ వర్మ ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశాడు. ఇది హనుమాన్ మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. జై హనుమాన్ 2025 కల్లా థియేటర్స్ లోకి తీసుకు వస్తారట. ఈలోపు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అధీరా, మహాకాళి చిత్రాలు విడుదల అవుతాయట.

మరి జై హనుమాన్ లో నటించే ఆ స్టార్ హీరో ఎవరు అనేది సస్పెన్స్. ఆల్రెడీ ప్రశాంత్ వర్మ సదరు స్టార్ హీరోతో చర్చలు జరిపి ఓకే చేశాడా? లేక స్టార్ హీరో వేటలో ఉన్నాడా? అనేది తెలియదు. హీరో రామ్ చరణ్ నటిస్తున్నాడంటూ ఓ పుకారు లేచింది. దీనిపై అధికారిక సమాచారం లేదు. భారతీయ ఇతిహాసాల్లోని పవర్ ఫుల్ రోల్స్ కి ముడిపెడుతూ ప్రశాంత్ వర్మ వద్ద 12 సూపర్ హీరో కథలు ఉన్నాయట. అవన్నీ తెరపైకి తెస్తానని ప్రశాంత్ వర్మ అంటున్నాడు.