Prashanth Varma and Balayya : నందమూరి నట సింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)… కెరియర్ మొదటి నుంచి కూడా ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని మాస్ హీరోగా నిలబెట్టడమే కాకుండా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా నిలిచాడు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ విషయంలో బాలయ్య బాబు చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ (Mokshagna) మొదటి సినిమా ఉంటుందంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికి ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకి అయితే వెళ్లడం లేదు. ఇక ఇప్పుడు మరోసారి ప్రశాంత్ వర్మ బాలయ్య బాబుకు మధ్య గొడవ జరిగినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
Also Read : మోక్షజ్ఞకు హ్యాండ్ ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ, స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీకి సిద్ధం!
దీంతో ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సినిమా నుంచి తప్పుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఏ దర్శకుడితో చేయబోతున్నాడు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అప్పట్లో భారీగా వినిపించినప్పటికి ఇప్పుడు మాత్రం ఆయన ఆ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఆయన కల్కి 2 (Kalki 2) సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆయనతో సినిమా చేసి ప్రీ ప్రొడక్షన్ కి బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంలో నాగ్ అశ్విన్ లేడట…మరి మోక్షజ్ఞ మొదటి సినిమా దర్శకుడు ఎవరు అనేదాని మీద క్లారిటీ అయితే రావడం లేదు…
ఇక మోక్షజ్ఞ ఏ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బాలయ్య బాబు మాదిరిగా మాస్ హీరోగా మారతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఆయన చేయబోతున్న సినిమాలు ఆయన సాధిస్తున్న సక్సెస్ ల మీదనే ఆధారపడి ఉంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం…చూడాలి మరి ఆయన సాధించే విజయాలు ఏ రేంజ్ లో ఉంటాయి అనేది.
Also Read : ప్రశాంత్ వర్మ ను ముంచిన ఓవర్ కాన్ఫిడెంట్…ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్లే ఆయన బాలయ్య చేతిలో తిట్లు తిన్నాడా..?