Prashanth Neel : ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు సైతం తనదైన రీతిలో భారీ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు… ఇప్పటివరకు చాలామంది దర్శకులు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు…
ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ప్రశాంత్ నీల్ ఒకరు…రాజమౌళి తర్వాత అతనితో పోటీ పడుతూ ముందుకు సాగుతున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు కావడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తో కలిసి అతనికి సినిమా స్టోరీ ని కూడా వినిపించారట. ఇక రామ్ చరణ్ కి ఆస్తులు పిచ్చిపిచ్చిగా నచ్చడంతో సినిమా చేసేద్దామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. మరి ఈ సినిమా 2028 వ సంవత్సరంలో పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాలను కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమాను చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి మరో 3 సంవత్సరాల్లో ఈ సినిమా పట్టాలెక్క అవకాశాలైతే ఉన్నాయి.
Also Read : ప్రశాంత్ నీల్ vs సందీప్ రెడ్డి వంగ వీళ్లలో టాప్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక రైతు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక గేమ్ చేంజర్ సినిమాలో అప్పన్న పాత్రలో నటించి మెప్పించాడు. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా 1990 బ్యాక్ డ్రాప్ లో ఒక రైతు పాత్రను పోషించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి ప్రశాంత్ నీల్ తన పంథాను మార్చి ఈ సినిమాను చేయబోతున్నాడా? లేదంటే ఇది కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడుకొని ఉంటుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అలాగే రామ్ చరణ్ సైతం బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాల విషయంలో భారీ కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి వీళ్ళిద్దరూ ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతం వాళ్ళు చేయాల్సిన సబ్జెక్టుల మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. మిగతా సినిమాల మీద ఆసక్తి చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఇక చిరంజీవి కూడా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రామ్ చరణ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. కాబట్టి వీళ్ళ కాంబోలో సినిమాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…
Also Read : ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ కత్తి పట్టబోతున్నాడా..?