Homeఎంటర్టైన్మెంట్Luger Meaning In Dragon Movie: LUGER ప్రశాంత్ నీల్ ఏదో సరదాగా పెట్టిన పేరు...

Luger Meaning In Dragon Movie: LUGER ప్రశాంత్ నీల్ ఏదో సరదాగా పెట్టిన పేరు కాదు.. దాని వెనక ఇంతటి చరిత్ర ఉంది..

Luger Meaning In Dragon Movie: పిరియాడిక్ డ్రామాలు తీయడంలో ప్రశాంత్ నీల్ తర్వాతే ఎవరైనా. తొలి సినిమా ఉగ్రం తర్వాత.. ప్రశాంత్ తన స్టైల్ పూర్తిగా మార్చుకున్నాడు. కర్ణాటకలో అత్యంత ఫేమస్ అయిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వ్యవహారాల మీద అతడు సీరియస్ గా స్టడీ చేశాడు. ఆ తర్వాత దానికి డ్రామా యాడ్ చేసి కేజిఎఫ్ అనే సినిమా తీశాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. వేల కోట్ల రూపాయలను వసూలు చేసి, కన్నడ ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాతోనే ప్రశాంత్ ఆగిపోలేదు.

సలార్ అనే సినిమా కూడా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలోనే రూపొందించాడు. ఇందులో తెగలు.. వారి మధ్య పోరాటాలు.. మధ్యలో దేవా అనే వ్యక్తి ప్రవేశించడం.. ఆ తర్వాత ఆ సామ్రాజ్యాలు ఎలా మారిపోయాయి.. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి వంటి అంశాలను మొదటి భాగాల్లో చూపించాడు ప్రశాంత్. ఆ తర్వాత రెండవ భాగం పై ఆసక్తిని మరింత పెంచాడు. కేజీఎఫ్ లో మూడో భాగం కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశాడు. ఈ కాలపు దర్శకులు తమకంటూ సినిమాటిక్ యూనివర్స్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో విజయవంతమైన వారు కొందరు మాత్రమే. ఆ జాబితాలో ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉంటాడు.

ప్రశాంత్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. అందులో మాదక ద్రవ్యాలు.. రెండు ట్రేడింగ్ కంపెనీల మధ్య సాగే వ్యవహారాలు ప్రధానంగా చూపించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు LUGER అని పేరు పెట్టాడు ప్రశాంత్. అయితే ఇదేదో ఆషామాషీగా పెట్టిన పేరు కాదు. దీని అర్థం వెతికితే చాలా పెద్ద చరిత్ర వచ్చింది. గూగుల్లో లభిస్తున్న సమాచారం ప్రకారం లూగర్ అనేది జర్మన్ నైన్ ఎం ఎం సెంటీమీటర్ ఆటోమేటిక్ పిస్టల్. ఇది రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు జర్మన్ సైన్యానికి ప్రామాణికమైన సర్వీస్ తుపాకీగా ఉండేది. పైగా ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా క్రూరమైన వ్యక్తి లాగా కనిపిస్తున్నాడు. వందల మందిని చంపేసి.. ఇంకా తన కలలోకి శత్రువులు రాకూడదని.. వస్తే మాత్రం వేరే విధమైన పనిష్మెంట్ ఉంటుందని హెచ్చరిస్తున్నాడు.

ఇప్పుడు మాత్రమే కాదు. ప్రశాంత్ నీల్ చరిత్ర లో జరిగిన సంఘటనలను తన సినిమాలలో ప్రస్తావించాడు. కేజిఎఫ్ సినిమాలో కళాష్ నికావో, ఎల్డో రాడో, సలార్ సినిమాలో యుద్ధ విమానం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలను ప్రశాంత్ తన సినిమాలలో చూపించాడు. అయితే ఇప్పుడు డ్రాగన్ లో LUGER తోనే ఆగిపోయేలా కనిపించడం లేదు.. ఇంకా అనేక రకాల పాత్రలను.. వారి నేపథ్యాలను.. దాగి ఉన్న టెక్నికల్ పేర్లను బయటపెట్టే అవకాశం ఉంది. ఎంతైనా ప్రశాంత్ టెక్నికల్ జీనియస్. పైగా అతడికి పీరియాడికల్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. అందువల్లే తన సినిమాల్లో కథలు అలా ఉండేలా చూసుకుంటాడు ప్రశాంత్.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular