Prashant Neel- Jr. NTR
Prashant Neel : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్టీఆర్(Junior NTR) , ప్రశాంత్ నీల్(Prasanth Neel) మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా మొదలైంది. ఒక భారీ యాక్షన్ సన్నివేశం తో ఈ చిత్రాన్ని మొదలు పెట్టాడు డైరెక్టర్. ఈరోజు జరిగిన షూటింగ్ కి ఎన్టీఆర్ రాలేదు కానీ, మిగిలిన ఆర్టిస్ట్స్ పై పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. రెండు మూడు రోజుల పాటు ఈ షూటింగ్ జరగనుంది. ఎన్టీఆర్ తదుపరి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఇండియా లోనే మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఇదొకటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ లాంటి ఊర మాస్ హీరో తో, ఎలివేషన్ సన్నివేశాలకు గాడ్ గా పిలవబడే ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలు మాత్రమే చూసుకోవాలి. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయో, ఎన్ని బెంచ్ మార్కులు సెట్ అవుతాయో ఎవ్వరూ ఊహించలేరు.
అయితే ఈ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసుకునే రెమ్యూనరేషన్, ఎన్టీఆర్ కంటే ఎక్కువ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాస్తవానికి ప్రశాంత్ నీల్ ఇప్పుడు ‘సలార్ 2’ మూవీ షూటింగ్ చేయాలి. కానీ మైత్రీ మూవీ మేకర్స్ ముందుగా మా సినిమానే చేయాలని భారీగా అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నారట. ఆ అడ్వాన్స్ దాదాపుగా 60 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అంతే కాదు, ప్రశాంత్ నీల్ కి విడుదలయ్యాక లాభాల్లో వాటాలు కూడా ఉంటాయి అన్నమాట. ఎన్టీఆర్ కి కేవలం తన అన్నయ్య కళ్యాణ్ రామ్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ 60 కోట్ల రూపాయిల అడ్వాన్స్ మాత్రమే కాకుండా, లాభాల్లో వాటా అంటే దాదాపుగా 200 కోట్ల రూపాయిల వరకు డైరెక్టర్ కి వెళ్తాది అన్నమాట.
మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి కేవలం 120 కోట్ల రూపాయిలు మాత్రమే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. అంటే ఎన్టీఆర్ కంటే 80 కోట్ల రూపాయిలు ఎక్కువ రెమ్యూనరేషన్ అన్నమాట. ఎన్టీఆర్ కి తెలుగు లో విపరీతమైన క్రేజ్ , మార్కెట్ ఉంది , అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రశాంత్ నీల్ కి దేశవ్యాప్తంగా ప్రతీ ప్రాంతీయ భాషలోని సమానమైన క్రేజ్ ఉంది. అందుకే ఎన్టీఆర్ కంటే ప్రశాంత్ నీల్ ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఇకపోతే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా రవి బర్సూర్ వ్యవహరించబోతుండగా, రుక్మిణి వాసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి టైటిల్ గా డ్రాగన్ అనే పేరుని పరిశీలిస్తున్నారు కానీ, ఇంకా ఏది కూడా అధికారికంగా ఖరారు చేయడం లేదని అంటున్నారు.