Comedian Dhanraj : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, తనకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న కమెడియన్స్ లో ఒకరు ధనరాజ్(Comedian Dhanaraj). ఇతని కెరీర్ సిల్వర్ స్క్రీన్ సినిమాలతోనే మొదలైంది. గుర్తించుకోదగ్గ పాత్రలే చేశాడు. కానీ మధ్యలో ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్(Jabardasth comedy show) షో లో ఒక కమెడియన్ గా అడుగుపెట్టి, ఎన్నో వందల స్కిట్స్ చేసి బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని బుల్లితెర ఆడియన్స్ కి ఇంకా కాస్త దగ్గరయ్యాడు. బిగ్ బాస్ తర్వాత ధనరాజ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు కూడా అతనికి సినిమాల్లో అవకాశాలు బాగానే వచ్చాయి కానీ, బిగ్ బాస్ తర్వాత వచ్చిన అవకాశాలు వేరు.
అలా కమెడియన్ గా ఎన్నో మంచి పాత్రలను పోషించి, ఇండస్ట్రీ లో స్థిరపడిపోయాడు. ఇప్పుడు ఏకంగా ఆయన ఒక సినిమాకి దర్శకత్వం వహించే రేంజ్ కి ఎదిగిపోయాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘రామం..రాఘవం'(Ramam..Raghavam Movie) చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కానుంది. ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని సరికొత్త కోణం లో చూపిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం లో తండ్రి పాత్ర సముద్రఖని చేయగా, కొడుకు పాత్రని ధనరాజ్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎదో అనుకున్నాం కానీ, సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్టు ఉంది అంటూ ఈ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేసారు. ఇకపోతే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ధనరాజ్ ఎడాపెడా ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు.
అలా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) గురించి, ఆయనకు ఉన్నటువంటి మంచి మనసు గురించి ధనరాజ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ అల్లు అర్జున్ గారితో నేను పరుగు సినిమా చేశాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక రోజు నేను ఆయన దగ్గరకు వెళ్లి, సార్ మార్చి 5న నా పెళ్లిరోజు, ఆరోజున మీరు మా ఆవిడకు కాల్ చేసి సర్ప్రైజ్ చేయగలరా అని అడిగాను. హీరోల వద్దకు నేరుగా వెళ్లి అలా అడగకూడదు అనే విషయం నాకు తెలియదు. మార్చి 5 న మా ఆవిడ బట్టలు మడత పెడుతుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తుకోగానే నేను బన్నీ ని అన్నాడు. సార్..అనగానే నేనయ్య బన్నీని, మీ పెళ్లి రోజున మీ ఆవిడకి సర్ప్రైజ్ కాల్ చేయమన్నావ్ కదా అని అన్నాడు. అప్పుడు నేను షాక్ కి గురై , సార్ సార్ అని అంటూ లౌడ్ స్పీకర్ ఆన్ చేశాను. ఆయన మా ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేసాడు. అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి, ఎన్నో పనులు పెట్టుకొని కూడా తన పెళ్లిరోజుని గుర్తు పెట్టుకొని మరీ ఫోన్ చేసాడంటే ఎంత గొప్ప మనసో’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు ధనరాజ్.