Prashant Neel , NTR
Prashant Neel and NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అలాంటిది లేనిదే ఎన్టీఆర్ (NTR) సినిమాలు అయితే చేయడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర’ (Devara) సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి ఎన్టీఆర్ కెరియర్ లో సోలో హీరోగా భారీ రికార్డును కొల్లగొట్టిన సినిమాగా ఆ సినిమా చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి…ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ (Drogan) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో కూడా సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు.
ముఖ్యంగా హీరోల మధ్య ఉండే పోటీలో తను కూడా ముందు వరుసలో ఉండాలని ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు… ఇక ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకు సంబంధించిన స్టోరీ లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఇంతకీ లీకైన స్టోరీ ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక రాజ్యానికి సేనాధిపతి లాగా ఉండి ఆ రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటారట. ఇక సలార్ (Salaar) సినిమాలో కాన్సర్ సామ్రాజ్యాన్ని సృష్టించినట్టు గానే ఈ సినిమాలో కూడా ఒక పెద్ద రాజ్యమైతే ఉండబోతుందట…
అందులో ఎన్టీఆర్ ను చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో భాగంగా ప్రభాస్ ఎన్టీఆర్ ని కలిపే అవకాశాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి ఒక భారీ సక్సెస్ అయితే కావాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాతో ఆయనకు ఆ సక్సెస్ దక్కుతుందని ఎన్టీఆర్ భావిస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…