Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: అక్కినేని అఖిల్ తెలుగు మాట్లాడేందుకు ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ తెలుగు మాట్లాడేందుకు ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో, ఆ సినిమాకు ఏ రేంజ్ లో వసూళ్ల వర్షం కురుస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో , మన శంకర వరప్రసాద్ గారు , అనగనగా ఒక రాజు , మా ఇంటి బంగారం వంటి చిత్రాల తర్వాత భారీ లాభాలను దక్కించుకున్న సినిమా ఇదే. రాబోయే రోజుల్లో ఈ లాభాల సంఖ్య ఇంకా బాగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 12 ఏళ్ళ తర్వాత మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నప్పటికీ, అక్కినేని ఫ్యాన్స్ కి మర్చిపోలేని మెమరబుల్ జ్ఞాపకాలను అందించిన వాడిగా నిలిచారు అఖిల్. ఇదంతా పక్కన పెడితే అఖిల్ కి సంబంధించిన పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

నాగ చైతన్య మొదటి చిత్రం జోష్ విడుదలకు ముందు , ఫ్యామిలీ మొత్తం కలిసి యాంకర్ సుమ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో సుమ అఖిల్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ తాత గారి గురించి నాలుగు మాటలు తెలుగు లో చెప్పండి’ అని అందుగుతుంది. అందుకు నాగార్జున ‘నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటారా’ అని సెటైర్లు వేస్తారు. అప్పుడు అఖిల్ మాట్లాడుతూ ‘సాధారణంగా నేను తెలుగు పెద్దగా మాట్లాడను, తప్పులు మాట్లాడుతానేమో అని నాకు భయం. నాకు తెలుగు రాదు. మా తాతగారితో కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటాను. నాన్న ఒక్కరే నాతో తెలుగు లో మాట్లాడుతారు’ అంటూ చెప్పుకొచ్చారు అఖిల్. ఇదంతా ఒక అమెరికన్ వ్యక్తి తెలుగు లో మాట్లాడితే ఎలా ఉంటుందో , అలా అనిపించింది. చిన్నప్పటి నుండి అఖిల్ విదేశాల్లోనే ఎక్కువగా చదువుకోవడం వల్ల ఆయన బాషా మొత్తం అప్పట్లో ఇంగ్లీష్ లోనే ఉండేది.

సినిమాల్లోకి వచ్చే ముందు పూర్తి స్థాయిలో తెలుగు నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఇంటర్వ్యూస్ లో అధిక శాతం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. ఇది కాస్త అభిమానులను ఇబ్బందికి గురి చేసే విషయం. రాబోయే రోజుల్లో అయినా ఆయన పూర్తి స్థాయిలో తెలుగు మాట్లాడుతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ‘లెనిన్’ చిత్రం లో అఖిల్ రాయలసీమ యాసలో ఎంత అద్భుతంగా మాట్లాడారో మనమంతా చూశాము . సీమ ప్రాంతం లోనే చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన వాడిలాగా ఆయన మాట్లాడారు. అసలు ఒకప్పుడు తెలుగే పూర్తిగా మాట్లాడడం రానటువంటి అఖిల్ , ఇప్పుడు ఏకంగా సీమ స్లాంగ్ ని నేర్చుకొని అంత పర్ఫెక్ట్ గా మాట్లాడడం చూస్తుంటే , ఆయన డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version