Pranam Khareedu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతోంది. ఆయన ప్రస్థానం అనితర సాధ్యం…ఇండస్ట్రీలో ఏ సపోర్టు లేకుండా సినిమా అవకాశాల కోసం మద్రాస్ వెళ్లి అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఇంకెన్నో అవమానాలను తట్టుకొని, ఎన్నో పోరాటాలు చేసి చిన్న చిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని నిలదొక్కుకున్న ఒకే ఒక్క నటుడు మెగాస్టార్ చిరంజీవి…తన కెరియర్ మొదట్లో ఎన్నో అవకాశాలు తన చేతి దాకా వచ్చి చేజారి పోయాయి. ఒక్క ఛాన్స్ వస్తె తనను తాను ప్రూవ్ చేసుకుంటానని చూసిన చిరంజీవి దానికోసం విపరీతమైన ప్రయత్నం అయితే చేశాడు…ఇక మొత్తానికైతే ‘ప్రాణం ఖరీదు’ అనే సినిమాతో తను అరంగేట్రం అయితే చేశాడు. 1978 సెప్టెంబర్ 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిరంజీవి స్థానం గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు.
నిజానికి ఎక్కడో మొదలైన ఆయన ప్రస్థానం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచేంతవరకు ఎదిగిందని, మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక బ్రాండ్ గా తనను తాను మార్చుకున్నాడు. నిజానికి చిరంజీవిని మించిన నటుడు ఇండియాలో ఎవరు లేరు అనేది వాస్తవం… ఇప్పటివరకు ఆయన ఎంటైర్ కెరియర్ లో 150 కి పైన సినిమాలు చేశాడు.
అందులో విలక్షణమైన నటనతో డిఫరెంట్ పాత్రలను పోషించి ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ లను తీసుకొని మరి అందులో పరకాయ ప్రవేశం చేసి నటించి మెప్పించేవాడు అంటే చిరంజీవికి సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి కళామాతల్లి తన పేరు ప్రతిష్టలను పెంచడానికి చిరంజీవిని పుట్టించిందని చాలామంది చెబుతూ ఉంటారు…
కళ ఉన్నవాళ్లు కలగంటే అందుకోలేనిది ఏదీ లేదు అని ప్రూవ్ చేసి చూపించిన ఒకే ఒక వ్యక్తి చిరంజీవి…అలాంటి చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అతని అభిమానులు సైతం ఆనందపడుతున్నారు. మరి చిరంజీవి తన తదుపరి సినిమాలతో కూడా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉండడం విశేషం…