https://oktelugu.com/

Prakash raj: మా ఎన్నికల్లో వైసీపీ హస్తం ఉంది.. ఇవే ఆధారాలు: ప్రకాశ్​రాజ్​

Prakash raj: మా ఎన్నికలు ముగిసి రెండువారాలు గడిచినా.. సినీ పరిశ్రమలో వివాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా, మా ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందంటూ.. నటుడు ప్రకాశ్​రాజ్​ ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్స్​లో అవకతవకలు జరిగాయంటూ.. సిసిటీవీ ఫొటేజీ పరిశీలించి కృష్ణ మోహన్​కు లేఖ రాశారు ప్రకాశ్​ రాజ్. ఈ క్రమంలోనే సాంబశివరావు ఎన్నికల హాలులోకి ప్రవేశించడం గమనించారు. అసలు వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావుని ఎన్నికల హాలులోకి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 22, 2021 / 02:06 PM IST
    Follow us on

    Prakash raj: మా ఎన్నికలు ముగిసి రెండువారాలు గడిచినా.. సినీ పరిశ్రమలో వివాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా, మా ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందంటూ.. నటుడు ప్రకాశ్​రాజ్​ ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్స్​లో అవకతవకలు జరిగాయంటూ.. సిసిటీవీ ఫొటేజీ పరిశీలించి కృష్ణ మోహన్​కు లేఖ రాశారు ప్రకాశ్​ రాజ్. ఈ క్రమంలోనే సాంబశివరావు ఎన్నికల హాలులోకి ప్రవేశించడం గమనించారు. అసలు వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావుని ఎన్నికల హాలులోకి ఎలా అనుమతించారంటూ.. ప్రశ్నించారు. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాలు చేశారు. ​

    సాంబశివరావు ఎన్నికల హాల్‌లోని ఓటర్లను బెదిరించారని.. ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో మంచు విష్ణుతో సాంబశివరావు ఉన్న కొన్ని ఫొటోలను కృష్ణమోహన్‌కు పంపించారు.  జగ్గయ్యపేటకు చెందిన సాంబశివరావుపై క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన వీడియోలను బయటపెడతానని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు.  ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు ప్రకాశ్​రాజ్​.

    ఎంతో ఉత్కంఠంగా సాగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఓటమిపాలైన ప్రకాశ్​రాజ్​ మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రకాశ్​రాజ్​ ప్యానెల్ నుంచి గెలుపొందిన వారు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు  స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో జరిగిన అంశాలపై మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, మోహన్​ బాబు అనుచితంగా ప్రవర్తించారని బెనర్జీ అన్నారు. తనపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.