Prakash Raj Okkadu Movie: మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేసింది. మహేష్ బాబు కెరియర్ లోనే మొదటి కమర్షియల్ సక్సెస్ గా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మాస్ ప్రేక్షకులకు మహేష్ బాబు ను దగ్గర చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం… ఇప్పటివరకు మహేష్ బాబు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఒక్కడు సినిమాకు ఉండే ప్రాముఖ్యత వేరే లెవల్ అనే చెప్పాలి… ఇక ఈ సినిమా దర్శకుడు అయిన గుణ శేఖర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన కొన్ని విషయాల గురించి మాట్లాడాడు. మొదట ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ కోసం ప్రకాష్ రాజును అనుకున్నప్పటికి ఫిలిం ఛాంబర్ లో అతని మీద కొంతవరకు వ్యతిరేకత రావడం అతన్ని సినిమాల్లోకి తీసుకోకూడదు అంటూ కొన్ని మాటలు వినిపించాయట.
గుణశేఖర్ ఎమ్మెస్ రాజు ఇద్దరు కలిసి ప్రకాష్ రాజ్ ప్లేస్ లో వేరే హీరోని తీసుకుందామనుకున్నారట. ఇక అప్పటికే జయం సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న గోపీచంద్ ఈ సినిమాలో విలన్ గా సెట్ అవుతారని ఎమ్మెస్ రాజు అతన్ని పిలిచి మరి అతనితో డిస్కస్ చేశారట. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రకాష్ రాజ్ గుణశేఖర్ దగ్గరికి వచ్చి ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ అంటే నేనే చేయాలి.
అది నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను నువ్వు ఫిక్స్ అయిపో వేరే ఎవడు చేసిన నేను ఒప్పుకోను అంటూ అతను గుణశేఖర్ దగ్గరికి వచ్చి చాలా స్ట్రాంగ్ గా చెప్పారట. దాంతో ఫిలిం ఛాంబర్ లో ఉన్న గొడవ ను ప్రకాష్ రాజ్ క్లియర్ చేసుకొని ఈ సినిమా కోసం వచ్చారట. ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.
ఈ క్యారెక్టర్ కు ప్రకాష్ రాజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఈ విషయంలో గోపీచంద్ కొంతవరకు అప్సెట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తనను పిలిచి మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ నే పెట్టుకొని ఆ సినిమా చేయడం వల్ల అతను కొంతవరకు ఇబ్బంది పడ్డారట…