Prakash Raj Spirit: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ప్రభాస్(Rebel Star Prabhas) ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ కి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్(Prakash raj) ‘స్పిరిట్’ మూవీ నుండి తప్పుకున్నాడని, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ఏర్పడడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడడం తో ప్రకాష్ రాజ్ వాకౌట్ అయ్యాడని ఒక వార్త నిన్న ప్రచారమైంది. ఇక ఈరోజు అయితే సందీప్ వంగ, ప్రకాష్ రాజ్ మధ్య రాజకీయాల గురించి సెట్స్ లో చర్చ జరిగిందని, వాళ్ళ మధ్య కాస్త వాదోపవాదనలు పెరిగిపోయాయని, సందీప్ వంగ పవన్ కళ్యాణ్ అభిమాని కావడం తో అతని వైపు మక్కువ మాట్లాడడం ప్రకాష్ రాజ్ కి నచ్చలేదని, అందుకే వీళ్ళ మధ్య గొడవలు ఏర్పడడం వల్ల సినిమా నుండి ప్రకాష్ రాజ్ వెళ్లిపోయాడని, ఇలా ఎవరికీ తోచిన వార్తలు వాళ్ళు రాసుకున్నారు.
అయితే ఈ వార్తలు ప్రకాష్ రాజ్ వరకు చేరడంతో ఆయన వెంటనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ స్పిరిట్ మూవీ గురించి నిన్నటి నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త నా దృష్టికి వచ్చింది. నా సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ఇప్పటి వరకు మొదలు అవ్వలేదు. కానీ నేను షూటింగ్ కి వెళ్లినట్టు, సెట్స్ నుండి వాకౌట్ అయ్యినట్టు వార్తలు పుట్టించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను ప్రచారం చేసే మీ వాట్సాప్ ఫ్యాక్టరీలను ఇక మూసేయండి. ఏదైనా పని ఉంటే చూసుకోండి’ అంటూ, లాఫింగ్ ఎమోజీలను పెట్టి ఒక ట్వీట్ వేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ట్విట్టర్ లో ప్రకాష్ రాజ్ మొదటి నుండి చాలా యాక్టీవ్ గా ఉంటాడు. ప్రతీ విషయం పై ఆయన స్పందిస్తూ ఉంటాడు.
ఇక తన గురించి ఏదైనా రూమర్ వస్తే, నిమిషాల వ్యవధిలో రెస్పాన్స్ ఇవ్వడం ప్రకాష్ రాజ్ కి కొత్తేమి కాదు. ఇప్పుడు కూడా అదే చేశాడు. ఇక స్పిరిట్ మూవీ విషయానికి వస్తే ఈ సినిమాని మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు సందీప్ వంగ అధికారిక ప్రకటన కూడా చేసేసాడు. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కేవలం 5 రోజులు మాత్రమే జరిగింది. త్వరలోనే డెహ్రాడూన్ లో ప్రభాస్ పై 15 రోజుల పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు మేకర్స్. చూడాలి మరి ఈ చిత్రం తో సందీప్ వంగ పాన్ ఇండియా మార్కెట్ లో మరోసారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు అనేది.
To all the toxic #Fakenews peddlers…. On #Spirit the movie . We have not even started shooting for my scenes .. and you whatsup factories speculate stories . Grow up and have a life . #justasking
— Prakash Raj (@prakashraaj) February 9, 2026