క్రేజీ హీరోయిన్ గా మారలేక పోయానే అనే బాధతో ఎప్పుడు లోలోపల కుమిలిపోతూ ఉంటుందట ‘ప్రగ్యా జైస్వాల్’. పాపం చివరకు బాలయ్య సినిమాలో తాను హీరోయిన్ గా నటించాల్సి రావడం ‘నా బ్యాడ్ లక్’ అంటూ ఈ మధ్య ఓ పార్టీలో నోరు జారింది. ఆ మాటలు ఎలాగోలా బాలయ్య చెవిని చేరడం, బాలయ్య ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా చకచకా జరిగిపోయాయి.
మరి, ఆ చేదు సంఘటనను మర్చిపోవడానికో లేక తనకు ఈ సమయంలో మంచి పబ్లిసిటీ కావాలని ఆశ పడిందో గానీ, మొత్తానికి ప్రగ్యా తన డేటింగ్ కబుర్లను విప్పింది. ఇంతకీ ఏమి విప్పింది అంటే.. హిట్ అవ్వకముందే ఫేడ్ అవుట్ అయిన ఈ భామ, ఎవరితోనైనా డేటింగ్ కి వెళ్ళినప్పుడు మొదటిరోజే అతగాడు ఈమెను ముద్దు అడిగితే అసలు ఒప్పుకోలేదట.
ముందు ముచ్చట, ఆ తర్వాతే ముద్దు అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఈ భామ ఉద్దేశ్యం ఏమిటంటే.. తానూ డేటింగ్ వెళ్లే వ్యక్తి గురించి అర్థం చేసుకోవాలట. ముందుగా ఒకరికి ఒకరు కొద్దిగా అర్థమై, ఆ తర్వాత మనసులు కలిసి.. ఇక అప్పుడు పెదవులు కలిపితే వచ్చే ఆ సుఖమే వేరు అంటూ సిగ్గు పడుతూ చెప్పింది. మొత్తానికి ప్రగ్యా దగ్గర డేటింగ్ సూత్రాలు చాలానే ఉన్నాయి.
మరి ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎంతమంది తో డేటింగ్ చేసిందో.. అలాగే ప్రస్తుతం ఎవరితో డేటింగ్ చేస్తోందో ? లాంటి విషయాల గురించి మాత్రం చెప్పలేదు. అయితే ప్రగ్యా జైస్వాల్ గతంలో ఓ క్రియేటివ్ డైరెక్టర్ తో చాలా సన్నిహితంగా ఉంది. ఆ డైరెక్టర్ కి భార్యతో వచ్చిన గొడవల సమయంలో కూడా ప్రగ్యా ఆ దర్శకుడ్ని బాగా ఓదార్చింది.
కాకపోతే ఆ తర్వాత ఓ హిందీ నటుడితో సీక్రెట్ గా కొన్నాళ్లపాటు ప్రేమాయణం నడిపింది. ప్రస్తుతానికి ఏ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేవు. ఒక్క బాలయ్య సరసన ‘అఖండ’ సినిమాలో మాత్రం హీరోయిన్ గా నటిస్తోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Pragya jaiswals condition for lip kiss
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com