Pragathi: అందం, అనుకువ, చలాకీతనంతో అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది ప్రగతి. కానీ కొందరు మాత్రం ఈమెను ఆంటీ అని కూడా పిలుస్తుంటారు. ఆంటీ అన్నా కూడా, అమ్మాయి అన్నా కూడా పెద్దగా పట్టించుకోదు ఈ నటి. తన పని తాను చూసుకుపోతూ ఉంటుంది. తన జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకోదు. చీల్చి చెండాడేస్తుంది. అయితే ఈమె ప్రస్తుతం పెళ్లి చేసుకోబోతుందనే టాక్ ఎక్కువగా వస్తుంది. అయినా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి అని అందరూ తెగ ట్రోల్ చేస్తున్నారు.. ఆ వివరాలు మీకోసం..
ఈ సారి మాత్రమే కాదు ఇప్పటికే ఎన్నో సార్లు ఈమె పెళ్లి గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి మళ్లీ కూడా ఇదే వార్త వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవడమే కాదు ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు కూడా తెలియడంతో ఈ సారి ప్రగతి పెళ్లి ఫిక్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రగతి సింగిల్ మదర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆమె చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం.. తప్పుడు నిర్ణయంగా ప్రగతి బాధపడుతూ ఉంటుంది .
డిఫరెంట్ రోల్స్ చేస్తూ టాప్ పొజిషన్ లో ఉంది ప్రగతి. అయితే ఈమెకు ఓ ప్రొడ్యూసర్ రెండో పెళ్లి చేసుకోవాలనే ప్రపోజల్ పెట్టారట. అయితే చిన్న రిమార్క్ కూడా లేని ఆ ప్రొడ్యూసర్ పద్ధతిగా పెళ్లి చేసుకుంటాను అనడంతో ప్రగతి ఆయనపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రీజన్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి లైఫ్ లో తోడు అవసరం కాబట్టి ఈ విషయం ఆలోచించి ప్రగతి మరో స్టెప్ వేస్తుందనే అంటున్నారు కొందరు. ఇలా ఈ మధ్య కాలంలో ఎందరో పెళ్లి చేసుకున్నారు. చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రగతి పద్దతిగా పెళ్లి చేసుకుంటే తప్పు ఏంటి అని ఆమె అభిమానులు అంటున్నారు. కానీ ప్రొడ్యూసర్ కి బట్టతల ఉంటుందట. ఇక ప్రగతి అందం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి వీరిద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి.