Pradeep Vs Sudheer: సిల్వర్ స్క్రీన్ పై వెలగాలన్న వారి కలలు నెరవేరలేదు. లక్షల సంపాదన వదులుకుని చేసిన ప్రయోగం వికటించింది. వెరసి బుల్లితెర స్టార్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ లకు భారీ షాక్ తగిలింది.
కష్టపడి చిన్న స్థాయి నుండి స్టార్స్ ఎదిగారు ప్రదీప్ మాచిరాజు(PRADEEP MACHIRAJU), సుడిగాలి సుధీర్. యాంకర్ గా ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు ప్రదీప్. ఈ క్రమంలో అనేక అవమానాలు ఎదురయ్యాయని ఆయన స్వయంగా చెప్పాడు. గడసరి అత్త సొగసరి కోడలు షో ప్రదీప్ కి ఫేమ్ తెచ్చింది. మెల్లగా ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ యాంకర్ అయ్యాడు. మేల్ యాంకరింగ్ లో ప్రదీప్ కి ఒక దశలో తిరుగు లేకుండా పోయింది. అటు సుమ, ఇటు ప్రదీప్ బుల్లితెరను దున్నేశారు. ప్రదీప్ కి ఆడియెన్సులో ఉన్న ఫేమ్ రీత్యా.. స్వయంవరం జరగడం విశేషం. ప్రదీప్ స్వయంవరం షోకి సుమ యాంకరింగ్ చేసింది.
సుడిగాలి సుధీర్(SUDIGALI SUDHEER) సైతం ప్రదీప్ మాదిరి కెరీర్ బిగినింగ్ లో అష్టకష్టాలు పడ్డాడు. మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్.. హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో ఆకలి కష్టాలు చూశాడట. మంచి నీళ్లు తాగి ఫ్లాట్ ఫార్మ్ మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయని కొన్ని సందర్భాల్లో బయటపెట్టాడు. జబర్దస్త్ షో సుధీర్ ఫేట్ మార్చేసింది. తన కామెడీ టైమింగ్ తో సుధీర్ అనతికాలంలో టీమ్ లీడర్ అయ్యాడు. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ తన టీమ్ లో ఉండటం సుధీర్ కి ప్లస్ అయ్యింది. ఈ ముగ్గురు సుడిగాలి సుధీర్ టీం పేరుతో జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఢీ డాన్స్ రియాలిటీ షో సుధీర్ ఫేమ్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రొఫెషనల్ మెజీషియన్ అయిన సుధీర్ మంచి డాన్సర్, సింగర్ కూడాను. ఇలా మల్టీ టాలెంట్స్ చూపిస్తూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. బుల్లితెర వేదికగా ప్రదీప్, సుధీర్ ఎదిగిన తీరు అద్భుతం. అయితే వారి సిల్వర్ స్క్రీన్ ఆశలు నెరవేరలేదు. యాంకర్ నుండి హీరోలుగా ప్రమోట్ కావాలన్న వారి కలలు చేరిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రంతో సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. అనంతరం త్రీ మంకీస్ చేశాడు. గాలోడు మూవీతో హిట్ కొట్టాడు. ఇక హీరోగా సుధీర్ నిలదొక్కుకోవడం ఖాయం అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కాలింగ్ సహస్ర పరాజయం కాగా, సుడిగాలి సుధీర్ కి ఆఫర్స్ రావడం లేదు. ప్రకటించిన సినిమాలు కూడా ఆగిపోయాయని తెలుస్తుంది.
Also Read: Sudheer Anasuya: ఈటీవీలోకి మళ్లీ సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అనసూయ ఎంట్రీ! అసలేమైంది?
ప్రదీప్ సైతం హీరో కావాలని ఆశపడ్డాడు. మొదటి ప్రయత్నంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా చేశాడు. ఇది పర్లేదు అనిపించుకుంది. ఇక రెండో ప్రయత్నంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి చేశాడు. ఈ సినిమా కోసం యాంకరింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. జిమ్ లో కసరత్తులు చేసి మేకోవర్ అయ్యాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నిరాశపరిచింది. చేసేది లేక తిరిగి యాంకర్ గా మారాడు. త్వరలో స్టార్ మాలో ప్రసారం కానున్న ఓ షోకి ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. సుధీర్, ప్రదీప్ లను సిల్వర్ స్క్రీన్ పై ఎదగనివ్వలేదు. తొక్కేశారు అనే పుకార్లు కూడా ఉన్నాయి. అయితే టాలెంట్ ఉన్న వారిని ఎవరూ ఆపలేరు. హీరోగా సక్సెస్ కావడం అంత సులభం కాదు. టాలెంట్ తో పాటు లక్ కూడా కుదరాలి కొందరు వాదిస్తున్నారు.