Pradeep Ranganathan remuneration: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్…ఆయనకు తెలుగులో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ లాంటి సినిమాలతో వరుసగా మూడు సక్సెస్ లను సాధించిన ఆయన ప్రస్తుతం ‘ఎల్ఐకే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుందంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు… ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా సక్సెస్ తో మరోసారి తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచే అవకాశాలు ఉన్నాయని చాలామంది తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన వరుసగా మూడు విజయాలు ఇవ్వడం ఇది నాలుగో విషయం కావడంతో ఇప్పుడున్న స్టార్ హీరోలతో పోటీ పడుతూ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎల్ఐకే సినిమా కోసం 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన ఇప్పుడు 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే అతనితో సినిమాలు చాలా మంది దర్శకనిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ప్రదీప్ రంగనాథన్ సినిమాలు చేసి భారీ విజయాన్ని దక్కించుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు ప్రదీప్ రంగనాథన్ కి ఫ్లాప్ అనేది లేదు. కాబట్టి అతని సినిమాలు మినిమం గ్యారంటీ సక్సెస్ లను సాధిస్తాయని నమ్మకం జనాలకు వచ్చింది. కాబట్టి ప్రదీప్ రంగనాథన్ సైతం ఆ విషయంలో కాంప్రమైజ్ కాకపోయిన కూడా కథల విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి.
ఎందుకంటే ఆయనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ మార్కెట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తన మీదే ఉంది. ఒకవేళ పొరపాటున తనకి ప్లాప్ లు వచ్చాయంటే మార్కెట్ మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఆయన కథల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని అతని అభిమానులైతే చెబుతున్నారు…