LIK Movie Advance Bookings: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘LIK : లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10 న భారీ లెవెల్ లో తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మొన్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించగా, నిన్న తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఆ చిత్ర నిర్మాత నయనతార ఎంట్రీ ఇచ్చి, తన భర్త విగ్నేష్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వడం , విగ్నేష్ కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అవ్వడం వంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా బాగానే ఉంది కానీ , ఎందుకో ఎన్ని చేసినా ఈ సినిమా పై అనుకున్నంత స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వడం లేదు.
ప్రదీప్ గత చిత్రం ‘డ్యూడ్’ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ చిత్రానికి ఎందుకో అందులో పావు శాతం క్రేజ్ కూడా లేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ పాట హిట్ అయ్యింది , అదే విధంగా టీజర్, ట్రైలర్ వంటి వాటికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ కావాల్సినంత బజ్ రాలేదు. కారణం , ఎప్పుడో రెండేళ్ల క్రితం విడుదల అవ్వాల్సిన సినిమా , బాగా ఆలస్యం అవ్వడం వల్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం , ఇప్పటి వరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా తమిళ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వసూళ్లు 1 కోటి 20 లక్షల రూపాయిల వరకు రాగా , తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం 30 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది.
‘డ్యూడ్’ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 4 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. అలాంటిది ‘LIK’ చిత్రానికి కేవలం 30 లక్షల గ్రాస్ మాత్రమే నమోదు అవ్వడం చూస్తుంటే, ఈ చిత్రానికి ఏ రేంజ్ తక్కువ బజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు మధ్యాహ్నం నుండి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పికప్ అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి ప్రస్తుతం రెండు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రదీప్ గత చిత్రం తో పోలిస్తే చాలా తక్కువ ఉండొచ్చు కానీ, టాక్ వస్తే మాత్రం కౌంర్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయని, కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ ఉంటుందని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.