Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇండియాలో ఎవరికి దక్కని క్రేజ్ తెలుగు హీరోలకు, దర్శకులకు మాత్రమే దక్కుతుంది. మన వాళ్ళతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి హీరో దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే మనా వాళ్ల టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఆపాన్ ఇండియాలో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టగా ప్రస్తుతం రాబోతున్న సినిమాలతో మరో మెట్టు ఎక్కే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రభాస్ లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం అనే చెప్పాలి… ఇక ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ లో చేసిన పౌర్ణమి సినిమా తన కెరీర్ కి ఏ రకంగానూ ఉపయోగపడలేదు. సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను తెచ్చుకోవడంతో ప్రభాస్ చాలా వరకు డీలా పడిపోయాడు. ఇక ఈ సినిమాకి ప్రభుదేవా డైరెక్షన్ చేయడం విశేషం…గతంలో ఆయన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో దర్శకుడుగా మారాడు.
ఆ సినిమా అందించిన సక్సెస్ తో వెంటనే ప్రభాస్ తో పౌర్ణమి సినిమా చేసినప్పటికి అది అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదు. రీసెంట్ గా ప్రభుదేవా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పౌర్ణమి సినిమాని ప్రభాస్ తో చేయాల్సింది కాదు. ఎందుకంటే అప్పటికే ఆయన చత్రపతి లాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.
కాబట్టి ఆ కథ అతని ఇమేజ్ కి సరిపోలేదు అందువల్ల సినిమా తేడా కొట్టింది అంటూ అతను కొన్ని కామెంట్లు చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ మరో సినిమా అయితే చేయలేదు. మొత్తానికైతే ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారి సినిమా చేస్తానంటే ప్రభాస్ డేట్స్ ఇవ్వడం అనేది నిజంగా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని కలిగించే విషయమనే చెప్పాలి…
ఇక ఇప్పటికి ప్రభుదేవా తెలుగులో హిట్ అయిన సినిమాని తమిళంలో రీమేక్ చేశాడు. తమిళ్లో హిట్ అయిన సినిమాని బాలీవుడ్ లో చేస్తాడు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ప్రభుదేవా ఎంటైర్ కెరియర్ ను చూసుకుంటే అటు కొరియోగ్రాఫర్ గా, ఆర్టిస్ట్ గా, డైరెక్ట్ గా పలు రకాల బాధ్యతలను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు…
