https://oktelugu.com/

Prabhas Adipurush: ప్రభాస్ ఒక్క ఫ్లాప్ సినిమా కలెక్షన్స్ బాలీవుడ్ సూపర్ హిట్ కలెక్షన్స్ సమానమా..!

ఇక ప్రభాస్ నటించిన రీసెంట్ చిత్రం 'ఆదిపురుష్' కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాక్ డిజాస్టర్ గా వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆదిపురుష్ చిత్రానికి ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లకు చాలా సంతృప్తి చెందినట్టుగా చెప్పుకొచ్చారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 28, 2023 / 11:52 AM IST

    Prabhas Adipurush

    Follow us on

    Prabhas Adipurush: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ప్రభాస్ ని మించిన పాన్ ఇండియన్ సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న హీరో మరొకరు లేరు. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన ఎవ్వరూ కూడా అందుకోలేని రేంజ్ కి ఎదిగిపోయాడు. #RRR చిత్రం తో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ లో ఫేమ్ ని సంపాదించి ఉండొచ్చు.

    కానీ బాహుబలి సిరీస్ కారణంగా ప్రభాస్ కి వచ్చిన స్టార్ స్టేటస్ మరియు ఫాలోయింగ్ మా హీరోలకు కూడా రాలేదని స్వయంగా ఆ ఇద్దరి హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాళ్ళు అలా చెప్పడానికి కూడా కారణాలు లేకపోలేదు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలకు ఘోరమైన డిజాస్టర్ టాక్స్ వచ్చాయి. కానీ ఆ సినిమాలకి వచ్చిన 3 రోజుల వసూళ్లు మాత్రం చాలా మంది ఇండియన్ సూపర్ స్టార్స్ సూపర్ హిట్ క్లోసింగ్ కలెక్షన్స్ తో సమానం.

    ఇక ప్రభాస్ నటించిన రీసెంట్ చిత్రం ‘ఆదిపురుష్’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాక్ డిజాస్టర్ గా వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆదిపురుష్ చిత్రానికి ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లకు చాలా సంతృప్తి చెందినట్టుగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా విడుదల రోజు కొంతమంది ప్రముఖ బాలీవుడ్ కి చెందిన PR టీం ఆదిపురుష్ చిత్రం పై ఘోరమైన నెగటివ్ టాక్ ని మరియు రేటింగ్స్ ని వ్యాప్తి చెందేలా చేసింది.

    దీనిపై భూషణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభాస్ ఒక్క డిజాస్టర్ ఫ్లాప్ సినిమా వసూళ్లు, బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా వసూళ్లతో సమానం అంటూ చెప్పుకొచ్చాడు, అంత పెద్ద నిర్మాత ఇలాంటి మాట మాట్లాడడం తో బాలీవుడ్ మొత్తం అట్టుడికిపోతోంది, సోషల్ మీడియా లో భూషణ్ కుమార్ పై తీవ్రమైన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.