Prabhas Brother
Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ప్రభాస్ లాంటి నటుడు సైతం పాన్ ఇండియాలో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసే ప్రతి సినిమా కూడా మంచి విజయాలు సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న మిగతా సినిమాలన్నీ కూడా భారీ విజయాలను సాధిస్తాయని తన అభిమానులు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి ఆయన కూడా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రాబోయే సినిమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రభాస్ తో పాటు ప్రభాస్ వాళ్ళ తమ్ముడు అయిన సిద్ధార్థ రాజ్ కుమార్ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. కెరటం అనే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఆయనకు ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు.
దాంతో ఆయన తదుపరి సినిమాను కూడా చేయడానికి ఆసక్తి చూపించకుండా ప్రస్తుతం బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా యంగ్ రెబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో సక్సెస్ కాకపోవడం అనేది నిజంగా చాలా బ్యాడ్ లక్ అని చెప్పాలి.
ఇక అన్ని ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక ప్రభాస్ హీరోగా ఉండటం అనేది అతని అభిమానులకు కొంతవరకు నిరాశను కలిగిస్తుంది. మిగతా హీరోల ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. ప్రభాస్ కుటుంభం నుంచి కూడా కనీసం ఇద్దరు ముగ్గురు హీరోలు ఉంటే వాళ్ళందరి సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు.
మరి ఇకమీదటైనా తనకు సన్నిహితులను గానీ తన తమ్ముళ్ళను గాని మరోసారి ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక డార్లింగ్ ప్రభాస్ తో ఇప్పుడు సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ డైరెక్టర్స్ అందరూ క్యూ కడుతున్నారు…