Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు వైవిద్య భరితమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఇప్పుడు ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడు ‘సైరా’ సినిమాతో కొత్తగా ట్రై చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో అతను ఎక్స్పరిమెంట్లు చేయకుండా ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ సినిమాల బాటే పడుతున్నాడు. ఇక ఇంతకుముందు చేసిన ‘భోళా శంకర్’ సినిమా తమిళంలో వచ్చిన వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అయినప్పటికి ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. దాంతో ఇప్పుడు మన శంకర వరప్రసాద్ సినిమా మీదనే అతను భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కి రిలీజ్ అవుతోంది.
జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు ఆయన మంచి క్రేజ్ ను సంపాదించి పెడితే ఇప్పుడు ఆయన జానర్ ను మార్చి సినిమాలను చేసి సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
ఎందుకంటే ఒకే జానర్ లో రిపీటెడ్ గా సినిమాలు చేయడం వల్ల చిరంజీవి నటన మీద ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి లేకుండాపోతోంది. ఆయన కనక థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తే చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆశిస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తన నటనను మరోసారి కొత్త ఆవిష్కరించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక చిరంజీవి మాత్రం ఎప్పుడు అదే రొటీన్ సినిమాలను చేస్తుండటం వల్ల అతని అభిమానులు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు… ఇప్పటివరకు చేసిన కమరియల్ సినిమాలు చాలని, ఇక ఎక్స్పరిమెంట్లు చేస్తే చూడాలని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి తన తదుపరి సినిమాల విషయంలో వైవిధ్యాన్ని పాటిస్తాడా? లేదా అనేది…