https://oktelugu.com/

ప్రభాస్ సినిమా కి మరో పెద్ద దర్శకుడు

బాహుబలి , సాహో వంటి రెండు పాన్ ఇండియా చిత్రాలు చేసాక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకి ముందు `జాన్ ` అని టైటిల్ పెట్టాలనుకొన్నారు . ఆల్రెడీ సమంత మూవీ అదే టైటిల్ తో రావడం తో ఇపుడు ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో […]

Written By:
  • admin
  • , Updated On : April 13, 2020 / 12:24 PM IST
    Follow us on


    బాహుబలి , సాహో వంటి రెండు పాన్ ఇండియా చిత్రాలు చేసాక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకి ముందు `జాన్ ` అని టైటిల్ పెట్టాలనుకొన్నారు . ఆల్రెడీ సమంత మూవీ అదే టైటిల్ తో రావడం తో ఇపుడు ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రేంజ్ కి తగ్గ యాక్షన్ సీన్స్ తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట .ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ నటన కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. ఇక .ఈ సినిమా తరువాత ప్రభాస్ మరో పెద్ద దర్శకుడితో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడు

    ‘కేజీఎఫ్’ మూవీ తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన తరవాతి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోగానీ .. మహేశ్ బాబు తో గాని సినిమా చేయాలను కొన్నాడు. కానీ కుదరలేదు. దాంతో ప్రశాంత్ నీల్ .. ‘కేజీఎఫ్ 2’ తరువాత చేయబోయే సినిమాను పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ తో చేయాలనే దృఢ సంకల్పం తో ఉన్నాడని తెలిసింది .

    ఈ విషయం ఫై ఆరాతీయగా ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్ వారి అడ్వాన్స్ ప్రశాంత్ నీల్ దగ్గర ఉందని, దాంతో వాళ్ళు ప్రభాస్ ని తమ బ్యానర్లో సినిమా చేయించ డానికి ప్రయత్నిస్తు న్నారని రూఢీగా తెలిసింది కరోనా గొడవ సద్దుమణి గాక ఈ ప్రాజెక్ట్ వివరాలు పూర్తి గా బయటికి వస్తాయి .