నేషనల్ స్టార్ గా ప్రభాస్ తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ ముందుకుపోతున్నాడు. బాలీవుడ్ బడా దర్శకుడు ఓం రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాని ప్రకటించి.. ఆ సినిమా షూటింగ్ కి కూడా డిసెంబర్ లో డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రభాస్ బాడీ పెంచనున్నాడట. సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడని.. హైట్ ను మ్యానేజ్ చేసినా.. ఆ హైట్ కి తగ్గ బాడీని చాలా సహజంగా చూపించాలని దర్శకుడు కోరాడని… అందుకే ప్రభాస్ ప్రస్తుతం తన బాడీని పెంచే సన్నాహాల్లో ఉన్నాడట. ఈ సినిమా స్టోరీకి సంబంధించి.. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ గాసిప్ కూడా వినిపిస్తోంది.
Also Read: మహాసముద్రం: శర్వాతో సై అంటున్న సిద్ధార్థ్ !
ప్రముఖ హాలీవుడ్ మూవీ `ది ఇమ్మోర్ట్స్ ఆఫ్ మెలుహా` సినిమాలోని మెలుహ పాత్రల శైలిలో ప్రభాస్ పాత్ర సాగుతోందని తెలుస్తోంది. అలాగే సినిమాలో ప్రభాస్ మూడు పాత్రలలో కనిపించబోతున్నాడని.. మెలూహ నాయకుడిగా అంటే మనిషి రూపంలో ఉండే నాగుల జాతికి సంబంధించిన నాయకుడిగా అన్నమాట. రీసెంట్ గా రిలీజైన పోస్టర్ లో కూడా ఒక లుక్ అచ్చం మెలూహ నాయకుడి తరహా లుక్ లోనే ప్రభాస్ కనిపిస్తున్నాడు. అలానే రాముడి పాత్రతో పాటు పరుశురాముడి పాత్రలో కూడా ప్రభాస్ కనిపిస్తాడట. కాగా మెలుహా ల్యాండ్స్ లో సాగే ఈ కథలో శివుని పాత్రలో ప్రభాస్ ను విజువల్ వండర్ గా కూడా చూపించబోతున్నారని కూడా బాలీవుడ్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.
అలాగే రామాయణ ఇతిహాసంలోని ఒక ముఖ్యమైన ఘట్టం ఆధారంగా ఈ సినిమాలోని చాలా భాగం ఉంటుందనే రూమర్ కూడా ఆ మధ్య బాగా వినిపించింది. కానీ, ఈ రూమర్ లో ఎలాంటి వాస్తవం లేదట. కాకపోతే హనుమాన్ పాత్ర మాత్రం సినిమాలో ఓ సందర్భంలో వస్తోందని.. అందుకే పోస్టర్ లో కూడా హనుమాన్ గెటప్ రివీల్ చేశారని.. కాకపోతే ప్రభాస్, హనుమాన్ పాత్రలో కనిపించడని తెలుస్తోంది. మొత్తానికి ఓ సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ని తీసుకుని.. సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన సీక్వెన్స్ లో హనుమాన్ ఎపిసోడ్ పెడతారట. ఇక బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. అన్నట్టు ఈ సినిమాని 3డి విజువల్ గ్రాఫిక్స్ తో ఒక మహదాద్భుతంగా తెరకెక్కించి దేశంలోని అన్ని భాషలతో పాటు విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.
Also Read: శ్రావణి కేసులో అసలు సూత్రధారి నిర్మాతేనా?