Prabhas Spirit Movie Delay: ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో అభిమానులు , ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి స్పిరిట్. ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్ లో రీసెంట్ గానే మొదలైన ఈ చిత్రం , రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్ వారం రోజుల వరకు చేశారు. ప్రభాస్ నాలుగు రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు. అదే విధంగా 2వ షెడ్యూల్ లో విలన్స్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య మీనన్ లపై ముంబై లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. వాళ్ళిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత మూడవ షెడ్యూల్ ఇప్పటి వరకు మొదలు అవ్వలేదు. సందీప్ వంగ ప్రభాస్ డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.
కానీ ప్రభాస్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదని టాక్. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన ఫోకస్ మొత్తం ‘ఫౌజీ’ చిత్రాన్ని పూర్తి చేయడం పైనే ఉంది. కేవలం మూడు యాక్షన్ బ్లాక్స్ ని పూర్తి చేస్తే సినిమా మొత్తం అయిపోతుంది. దసరా టార్గెట్ గా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ప్రభాస్ ద్రుష్టి మొత్తం ‘ఫౌజీ’ పైనే ఉండడంతో ‘స్పిరిట్’ కి డేట్స్ కేటాయించలేకపోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. కానీ ఆ తేదీన ఈ చిత్రం విడుదల కావడం అసాధ్యమని లేటెస్ట్ గా విశ్వనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. సందీప్ వంగ ఈ చిత్రాన్ని 2027 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట. సమ్మర్ లో వరుసగా భారీ పాన్ ఇండియన్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుంది అనుకుంటే , ఆ సమ్మర్ రేస్ నుండి స్పిరిట్ వైదొలగడం విశేషం.
స్పిరిట్ వాయిదా పడడంతో ఇప్పుడు రాజమౌళి ‘వారణాసి’ కి పోటీ లేకుండా పోయింది. ఎంతైనా మార్చి 5 న స్పిరిట్ లాంటి భారీ సినిమాని యూత్ ఆడియన్స్ ఎగబడి చూసిన తర్వాత , ‘వారణాసి’ ని కొంతమంది చూడకపోవచ్చు. కానీ ఇప్పుడు ‘స్పిరిట్’ లేకపోవడం వల్ల, యూత్ ఆడియన్స్ నేరుగా ఏప్రిల్ 7 న విడుదలయ్యే ‘వారణాసి’ కోసం మాత్రమే ఎదురు చూస్తారు. కనీవినీ ఎరుగని రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయి అని రాజమౌళి అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయం లో ఇంకా ఏమైనా భారీ ట్విస్టులు ఉండబోతున్నాయా లేదా అనేది.