Prabhas Spirit: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రభాస్ లుక్ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అయితే అవ్వడం లేదు.అందుకే ఫౌజీ సినిమా మొత్తం పూర్తయిన తర్వాత ప్రభాస్ కి ఒక మంచి మేకోవర్ అందించి అప్పుడు తన సినిమాను స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇక తన సినిమా చేస్తున్న సమయంలో ప్రభాస్ వేరే ఏ సినిమా చేయకూడదనే కండిషన్ ని కూడా పెట్టారు. కారణం ఏంటి అంటే తన సినిమాలో ఉన్న లుక్ ఇతర సినిమాల్లో ఉండే లుక్స్ తో ఎలాంటి సంబంధం ఉండకూడదు.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
కాబట్టి ప్రభాస్ ను ఒక సంవత్సరం పాటు తన సినిమా మీద డేట్స్ కేటాయించాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన డైరెక్టర్ హీరో… డైరెక్టర్స్ ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు. అందువల్ల అతనికితో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లందరు ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం…
ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ మేకోవర్ కోసం విపరీతమైన ప్రయోగాలైతే చేస్తున్నాడు. ఇప్పటికే టాప్ హెయిర్ స్టైలిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న అలీమ్ హకీమ్ స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ను ఒక డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగతో కలిసి ఆయన కబీర్ సింగ్ అనే సినిమాకి కూడా వర్క్ చేశాడు.
ఇక రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో కూడా వర్క్ చేశాడు. కానీ ప్రభాస్ తో మాత్రం మొదటిసారి వర్క్ చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ కి ఒక డిఫరెంట్ లుక్కు ఇచ్చి అతని అభిమానుల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి అనుగుణంగానే రీసెంట్ గా ఆలీమ్ హకీమ్ సందీప్ వంగతో కలిసి దిగిన ఫోటో కూడా ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకోబోతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…