
Trolls On Prabhas Looks: ప్రభాస్ అనగానే.. అందరి మదిలో ఓ బాహుబలి కటౌట్ గానీ.. లేదంటే మిర్చి లోని పిక్చర్ గానీ గుర్తుకొస్తుంది. కానీ.. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించిన పిక్స్ చూస్తే మాత్రం.. ఎవ్వరైనా షాక్ కు గురవ్వాల్సిందే. యంగ్ రెబల్ స్టార్ లేటెస్ట్ లుక్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా ఏంటీ.. ప్రభాస్ ఇలా మారిపోయాడు? ఎందుకిలా? ఏమైంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి, చురకత్తిలాంటి ప్రభాస్ కటౌట్ ఇలా ఎందుకు తయారైందన్నది ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ కెరీర్ ను రెండు రకాలుగా చూడొచ్చు. బాహుబలికి ముందు ఆ తర్వాత అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకూ అందరిలో ఒకరిగా ఉన్న రెబల్ స్టార్.. ఆ తర్వాత నేషనల్ ఫిగర్ అయిపోయాడు. బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’ తెలుగులో డిజాస్టర్ గా మిగిలితే.. బాలీవుడ్లో బాక్సాఫీస్ ను షేక్ చేయడమే ప్రభాస్ స్టామినా ఏంటో చాటి చెబుతోంది. రాబోతున్న సినిమాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి స్టార్ డమ్ కొనసాగిస్తున్న ప్రభాస్.. తన లుక్స్ విషయంలో మాత్రం తేలిపోతుండడం ఆశ్చర్యపరుస్తోంది.
నిజానికి.. ఆఫ్ ది రికార్డ్ ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడు. స్టార్ డమ్ ఎక్కడా ప్రదర్శించడు. డ్రెస్సింగ్ విషయంలోనూ చాలా లైట్. అయితే.. స్టైల్‌వరకు ఇలా ఉంటే ఓకే అనుకోవచ్చు. ఎలాంటి ఆడంబరాలూ నచ్చవు అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ.. ఫిజిక్ విషయంలో కూడా ఇలాగే ఉంటున్నాడా? అనే సందేహం కలుగుతోంది. తాజాగా.. బయటకు వచ్చిన ప్రభాస్ ఫొటోలు చూస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే. మార్నింగ్ వర్కవుట్స్ పక్కన పడేసి చాలా కాలమే అయ్యిందనిపిస్తోంది ఆ ఫొటోలు చూస్తే..
ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ చిత్రం కోసం ముంబైలోనే ఉంటున్నాడు. అక్కడే ఒక ఇల్లు తీసుకున్న రెబల్ స్టార్ ఆఫ్ ది సెట్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పార్టీలు, పబ్ లకు వెళ్తూ వర్కవుట్ల విషయంలో కాస్త శ్రద్ధ తగ్గించాడనే టాక్ నడుస్తోంది. టాప్ స్టార్ గా వెలుగొందుతున్న ప్రభాస్ విషయంలో ఇలాంటి మార్పు సరికాదని అంటున్నారు ఫ్యాన్స్. చురకత్తిలా ఉండాల్సిన ప్రభాస్.. ఇలా ఫేడవుట్ అయ్యేలా కనిపించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి, ఇకనైనా రెబల్ స్టార్ ఫిట్ నెస్ మీద దృష్టి పెడతాడేమో చూడాలి.