Prabhas New Look: నేషనల్ స్టార్ ప్రభాస్ సీతారామం ఈవెంట్‌కు వచ్చినప్పుడు ప్రభాస్ లుక్ బాగా వైరల్ అయింది. ఆ వేడుకలో ప్రభాస్ వేసుకున్న డ్రెస్, పెట్టుకున్న క్యాప్, అలాగే గాగుల్స్ వరకు అన్నీ చాలా స్టైలిష్ గా కనిపించాయి. అయితే, ఇప్పుడు మరోసారి ప్రభాస్ లుక్ వైరల్ అవుతుంది. హైదరాబాద్‌లోని అవసా హోటల్‌లో సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె ఫంక్షన్‌కు ప్రభాస్ హాజరయ్యాడు. ప్రభాస్ బ్లాక్ షర్ట్ ధరించాడు. ఈ లుక్ లో ప్రభాస్ వెరీ స్టైలిష్‌గా కూల్‌గా కనిపిస్తున్నాడు.

దాంతో ప్రభాస్ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రభాస్ ఈ కొత్త లుక్ లో చాలా సన్నగా కనిపిస్తున్నాడు, అలాగే ప్రభాస్ మీసాలు కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. అందుకే అభిమానులు ఈ కొత్త లుక్ ను ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ ప్రభాస్ ఈ లుక్ ను ఎందుకు ట్రై చేశాడు ? అని ఫ్యాన్స్ చర్చ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ లుక్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ తెలిసింది.
కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ లుక్ సలార్ సినిమాలోది అని తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “సలార్” రాబోతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోపక్క యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా పై అనేక నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. సినిమా పై అంచనాలు తగ్గించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ సినిమా ‘ఉగ్రమ్’ అనే కన్నడ సినిమాకి రీమేక్ అని యాంటీ ఫ్యాన్స్ ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పుడు వారందరికీ ఈ లుక్ దీటైన సమాధానాన్ని ఇస్తోంది. ఈ లుక్ తో ‘ఉగ్రమ్’కి సలార్ కి సంబంధం లేదని తేలిపోయింది. ఇప్పటికే ‘సలార్’ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే ప్రశాంత్ కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. నటీనటుల విషయంలో కూడా భారీ తారాగణాన్ని తీసుకున్నాడు.

పైగా నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ చేస్తున్న మొట్టమొదటి ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది. అందుకే, ఈ సినిమా కోసం సినిమా వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో త్వరలో స్టార్ట్ కానున్న కొత్త షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తారట. ఇప్పటికే అక్కడ భారీగా సెట్స్ కూడా వేశారు. ప్రభాస్ ప్రస్తుతం కేవలం ఈ సినిమా కోసమే బల్క్ డేట్స్ కేటాయించాడు.
[…] […]