డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎకౌంట్ లో ఫాలోవర్స్ ఎంత ఎక్కవ మంది ఉంటే, అంతగా పాపులారిటీ ఉందని అంచనా వేసే రోజులు ఇవి. అందుకే ఎంత గొప్ప స్టార్స్ అయినా ఫేస్ బుక్ దగ్గర నుండి ఇన్ స్టా, ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో ఫాలోయింగ్ కోసం బాగానే తాపత్రయపడతారు. సీనియర్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబు, నాగ్, వెంకీ.. చివరికీ రాజశేఖర్ కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఉత్తేజపరుస్తున్నారంటే.. సోషల్ మీడియా ప్రభావం అర్ధం చేసుకోవచ్చు.
అయితే తాజాగా డిజిటల్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ప్రభాస్ ఫేస్ బుక్ పేజికి కోటి 4 లక్షల మంది పాలోవర్స్ వచ్చి చేరారు. 14 మిలియన్ల పాలోవర్స్ చేరడం అనేది సంచలనమే. పైగా ఇప్పటి వరకూ ఏ హీరోకి అంతమంది పాలోవర్స్ లేరు. సౌత్ ఇండియాలో ఎక్కువమంది పాలోవర్స్ ఉన్న హీరోగా ఫేస్ బుక్ లో రికార్డు నమోదు చేసిన క్రెడిట్ ప్రభాస్ దే. ఆ తర్వాతి స్థానంలో మన హీరోల్లో అల్లు అర్జున్ 13.1 మిలియన్ల తో రెండో స్థానంలో నిలిచాడు.
ఆ తర్వాత రామ్ చరణ్, మహేష్ వీళ్లంతా. మహేష్ 7.97 మిలియన్ల ఫాలోవర్స్ ని కలిగి ఉండగా, రామ్ చరణ్ 7.1 మిలియన్లు.. నాని 5.2 మిలియన్లు ఫేస్ బుక్ ఫాలోవర్స్ ని కలిగి ఉండటం విశేషం. బాహుబలి క్రేజుతో సర్రున దూసుకొచ్చిన ప్రభాస్ ఇప్పటికి ఫేస్ బుక్ లో నంబర్ వన్ స్థానం అందుకోవడం ప్రభాస్ స్థాయిని పెంచేదే. ఇక మహేష్ కి నమ్రత ఫాలో అప్ ఉంటుంది. డిజిటల్ టీమ్ ని ప్రత్యేకించి హ్యాండిల్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచే బాధ్యత ఆవిడ చూసుకుంటున్నారు. అలాగే చరణ్ .. ప్రభాస్ ఇటీవలే డిజిటల్ టీమ్ లను ఏర్పాటు చేసుకుని ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.