Rajasaab : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్(Prabhas) లాంటి స్టార్ హీరోకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో కూడా ఆయన చాలా వరకు ముందు వరుసలో ఉన్నాడు. మరి ఇదిలా ఉంటే బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన సినిమాలను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్ లో ఫౌజీ(Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసమే తన పూర్తి డేట్స్ ని కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ‘రాజాసాబ్’ (Rajasaab) సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తాం అంటూ ముందే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం ఎటువంటి డేట్స్ ని కేటాయించడం లేదట.
ఇక బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారు.ఇక అనుకున్న డేట్ కి సినిమాను తీసుకొస్తారా లేదా అనే డౌట్లు అయితే ప్రేక్షకుల్లో విపరీతంగా ఉన్నాయి. మరి ప్రభాస్ ఎందుకు ఇలాంటి వైఖరిని అనుసరిస్తున్నాడు.
మారుతి(Maruthi) ఈ సినిమా మీదనే దాదాపు మూడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ వస్తున్నాడు. నిజానికి అయితే మారుతి ఒక సంవత్సరంలో రెండు నుంచి మూడు సినిమాలు చేసుకుంటూ ఉంటాడు. అలాంటి మారుతి మూడు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయకుండా కేవలం రాజాసాబ్ సినిమా కోసమే తను ఫుల్ గా వర్క్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ కూడా అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం డేట్లు కేటాయించడానికి రెడీగా ఉన్నప్పటికి ఫౌజీ (Fouji) సినిమా షెడ్యూల్స్ బ్యాక్ టు బ్యాక్ ఉండడం వల్ల రాజాసాబ్ సినిమా మీద డేట్లు కేటాయించాల్సిన సమయం అయితే లేకుండా పోతుందట…చూడాలి మరి రాజాసాబ్ ను అనుకున్న డేట్ కి తీసుకువస్తారా లేదా అనేది…