
Prabhas Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ మూవీ కోసం కేవలం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియా వైడ్ ఉన్న ప్రతీ సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.గత ఏడాది నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు చివరి దశకి చేరుకుంది.త్వరలో జరగబొయ్యే ఇటలీ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్టే.నిన్న మొన్నటి వరకు ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అనే న్యూస్ బాగా వినిపించేది.
ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో రెండు సార్లు సినిమా అంటే అద్భుతం అనే ఫీలింగ్ లో ఫ్యాన్స్ ఉండేవారు.ఇప్పుడు తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది.అదేమిటి అంటే ఈ చిత్రాన్ని కేవలం ఇండియన్ బాషలలో మాత్రమే కాదు, ఇంగ్లీష్ లో కూడా డబ్ చేయబోతున్నారట.దానికి సంబంధించిన కార్యక్రమాలు ఇటీవలే మొదలెట్టినట్టు సమాచారం.
#RRR సినిమాతో ఇండియన్ మూవీస్ కి పాన్ వరల్డ్ మార్కెట్ ఓపెన్ అయ్యింది.విదేశీయులు మన ఇండియన్ సినిమాలను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు.అందుకే ఇప్పుడు ఆ అవకాశం ని సద్వినియోగం చేసుకోవాలని ‘సలార్’ మూవీ టీం భావిస్తుంది.అందుకే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో దబ్ చేసి గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇదే కనుక అనుకున్న విధంగా సక్సెస్ అయితే మాత్రం ఇక మన స్టార్ హీరోలందరూ ఇంగ్లీష్ లో కూడా తమ సినిమాలను డబ్ చెయ్యడానికి ముందుకొస్తారు.
అప్పుడు మన ఇండియన్ సినిమా మార్కెట్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో అందనంత ఎత్తులో ఉంటుంది.అయితే ఈ సినిమా ఇండియన్ భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా విడుదల అవుతుందా, లేదా ఇక్కడ విడుదలైన కొద్దీ రోజుల తర్వాత హాలీవుడ్ లో విడుదల అవ్వబోతుందా అనేది తెలియాల్సి ఉంది.