
Dhanush ‘Sir’ : తమిళ హీరో ధనుష్ తెలుగు లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన ‘సార్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ధనుష్ లాంటి క్రేజీ సౌత్ ఇండియన్ హీరో తెలుగులో సినిమా చేస్తున్నాడు అన్నప్పుడే ఈ సినిమా పై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.దానికి తగ్గట్టుగానే ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.
అలా కేవలం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకున్న ఈ సినిమా , నాల్గవ రోజు నుండి వచ్చే లాభాలను లెక్కపెట్టుకోవడానికి నిర్మాతలకు మరియు బయ్యర్స్ కి సమయం సరిపోయింది.డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రం నాలుగు వారాలు ఆడే సినిమా అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు.కానీ పరిస్థితి చూస్తూ ఉంటే 50 రోజులు ఆడే సినిమా అని అనిపిస్తుంది.
రీసెంట్ గానే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు.ఓటీటీ లో ఒక్కసారి సినిమా విడుదల అయ్యిందంటే రన్ ఆగిపోయింది అని దాని అర్థం , కానీ ఈ సినిమా ఓటీటీ లో వచ్చినప్పటికీ కూడా గత వారం పలు ప్రాంతాలలో కొత్తగా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలకంటే అద్భుతమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకోవడం చర్చనీయాంశం గా మారింది.ఆదివారం రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిందట.
స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇంత డీసెంట్ లాంగ్ రన్ ఈమధ్య కాలం లో రాలేదు.ఇప్పటి వరకు పాతిక కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికే సూర్య, విజయ్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు లో దాటేసింది.ఇంకో కోటి రూపాయిల వరకు షేర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.చూడాలిమరి క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.