Prabhas Salaar: ప్రభాస్ సలార్ మూవీ విడుదల వాయిదా అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. గత రెండు రోజులుగా ఇది ఇండియా వైడ్ హాట్ టాపిక్. ఈ మేరకు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి సమాచారం ఇచ్చారని వినికిడి. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ చిత్ర వర్గాలు సలార్ వాయిదా అంటూ ఫిక్స్ అయ్యాయి. సెప్టెంబర్ 28న సలార్ విడుదల తేదీ కాగా, ఈ గోల్డెన్ ఛాన్స్ వదులుకోకూడని పలు చిత్రాల నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. శని ఆదివారాలతో పాటు గాంధీ జయంతి వరకు సెప్టెంబర్ 28న వడుదలయ్యే సినిమాకు లాంగ్ వీకెండ్ లభిస్తుంది.
అందుకే సలార్ మేకర్స్ చాలా కాలం క్రితమే ఈ తేదీని ఫిక్స్ చేశారు. సలార్ సీజీ వర్క్ పట్ల సంతృప్తి చెందని దర్శకుడు ప్రశాంత్ నీల్ టైం తీసుకోవాలని అనుకుంటున్నారని. సలార్ చిత్రాన్ని సంక్రాంతికి లేదా దీపావళి కానుకగా నవంబర్ లో విడుదల చేసే ఆలోచనలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల వెల్లడి. సలార్ విడుదల వాయిదా పడిన నేపథ్యంలో ఆ డేట్ మాకు కావాలని మూడు చిత్రాలు పోటీ పడుతున్నాయి.
కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ప్రకటించేశాడు. నిన్న ఉహాగానాలు ఎక్కువ కాగా నేడు ఆయన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28న విడుదల అంటూ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. సలార్ డేట్ పై కన్నేసిన మరో చిత్రం పెదకాపు. కొత్త హీరో విరాట్ కర్ణ నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. పెదకాపు చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.
సెప్టెంబర్ 28న రావాలని ఆరాటపడుతున్న మరో చిత్రం స్కంద. బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు యూనిట్ సిద్ధం అవుతుంది. దసరా కానుకగా విడుదల చేయాలని మొదట భావించారు. పోటీ ఎక్కువగా ఉండటంతో ప్రీ పోన్ చేశారు. మరలా సెప్టెంబర్ 28 కి పోస్ట్ పోన్ చేయాలని భావిస్తున్నారట. ఈ మూడు చిత్రాలు ఎలాగైనా ఈ తేదీకి రావాలని చూస్తుంటే… మనసు మార్చుకున్న సలార్ నిర్మాతలు చెప్పిన తేదీకే వస్తున్నారని మరో వాదన మొదలైంది…