Prabhas Salaar Teaser: ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ టీజర్ వచ్చేసింది. అనూహ్యంగా తెల్లవారుజామున టీజర్ విడుదల చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి కలిగిన సలార్ టీజర్ దుమ్మురేపింది. ఫ్యాన్స్, ఆడియన్స్ ఆశించే అంశాలను టీజర్లో పొందుపరిచారు. బొగ్గు గనులు, వేల మంది ప్రైవేటు సైన్యం. భీకర దృశ్యాల సమాహారంగా సలార్ టీజర్ ఉంది. ఇక ఆయుధాలతో సిద్ధంగా ఉన్న సలార్ శత్రు సైన్యాన్ని ఊచకోత కోస్తున్నాడు. ప్రభాస్ లుక్ చాలా అగ్రెసివ్ గా ఉంది. ఆయన చేతులు రక్తంతో తడిసిపోయాయి.
నటుడు టిన్ను ఆనంద్ హీరో ప్రభాస్ రోల్ ని ఎలివేట్ చేస్తూ కనిపించాడు. కారు మీద కూర్చొని ఉన్న ఆయనను శత్రువులు చుట్టుముట్టారు. వారితో సలార్ ఎంత డేంజరో చెప్పే ప్రయత్నం చేశాడు. ‘అడవిలో ఎలిఫెంట్, చిరుత, టైగర్, లయన్ చాలా డేంజరస్. కానీ జురాసిక్ పార్క్ లో కాదు. ఆ పార్క్ లో సలార్ ఉన్నాడని’, టిల్లు ఆనంద్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ లేపింది.
మీరందరూ తోపులు, డేంజరస్ అనుకుంటున్నారేమో…. సలార్ మీకంటే ప్రమాదం అని తెలియజేసే ప్రయత్నం చేశాడు. మోస్ట్ వైలెంట్ మెన్ కూడా వైలెంట్ మెన్ అని పిలిచేవాడే సలార్ అని గతంలో ఒక కొటేషన్ వదిలారు. కాబట్టి సలార్ మూవీలో వైలెన్స్ కి కొత్త అర్ధం చెప్పనున్నాడు ప్రశాంత్. చెప్పాలంటే సలార్ టీజర్ కెజిఎఫ్ చిత్ర పోలికలు, థీమ్ కలిగి ఉంది. కెజిఎఫ్ వలె అనిపిస్తుంది. ఆ గనులు, ప్రైవేట్ సైన్యం, అందరినీ ఎదిరించే ఒక వ్యక్తి. వంటి విషయాల్లో కెజిఎఫ్ ని తలపిస్తుంది.
టీజర్లో మరొక ఆసక్తికర విషయం వెల్లడించారు. సలార్ రెండు భాగాలుగా రానుంది. సలార్ టు పార్ట్స్ అంటూ ప్రచారం జరిగింది. నేడు అధికారికంగా తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. టీజర్ చివర్లో విలన్ రోల్ చేస్తున్న పృథ్విరాజ్ ని కూడా పరిచయం చేశారు. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు మరో కీలక రోల్ చేస్తున్నారు. కెజిఎఫ్ మేకర్స్ నిర్మించారు.
