Prabhas Salaar: హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా “సలార్”. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ఈ సినిమా రొమాంటిక్ సీన్స్ షూటింగ్ నేటితో పూర్తి అయింది. తర్వాత షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ వీడియో క్లిప్ లీక్ అయి వైరల్ గా మారింది. షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ మాస్ లుక్ లో ఉండగా ఎవరో వీడియో తీసి లీక్ చేశారు.
Prabhas Salaar
కాగా రఫ్ లుక్ లో ప్రభాస్ చాలా వైల్డ్ గా ఉన్నాడు. ఈ వీడియోలో పిక్ ను బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంచనా వేయొచ్చు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ కూడా ‘సలార్’ గురించి మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్’ సిరీస్ కి మించిన ఫుల్ యాక్షన్ మూవీ అని చెప్పుకొచ్చాడు. ఈ పిక్ లో ప్రభాస్ లుక్ చూస్తుంటే… ప్రశాంత్ నీల్ మాటల్లో మ్యాటర్ ఉందని అర్ధం అవుతుంది.
Also Read: Malavika: సీనియర్ హీరోయిన్ కొత్త సిరీస్.. ఎలా ఉంటుందో మరి ?
ఇక ఇన్నాళ్లు ఆదిపురుష్ సినిమా షూటింగ్ తో తీరిక లేకుండా గడిపిన ప్రభాస్, ఆ సినిమాను పూర్తి చేశాడు. అందుకే, సలార్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేశాడు. రెండు వారాల పాటు ‘సలార్’ కొత్త షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ అంతా విలన్ డెన్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అందుకే పలు విధాలుగా చెక్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
Prabhas Salaar
కానీ పిక్ లీక్ అవ్వకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోలేక పోయారు. ఏది ఏమైనా ఈ పిక్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఎలాగూ ‘సలార్’ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టు భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పైగా నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ చేస్తున్న మొట్టమొదటి ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది.
అందుకే, ఈ సినిమా కోసం సినిమా వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం కేవలం ఈ సినిమా కోసమే బల్క్ డేట్స్ కేటాయించాడు.
Also Read:RRR : 38 రోజుల కలెక్షన్స్.. అన్నీ కోట్లే.. ఇది షాకింగే !
#Salaar will be the Celebration
Of Masses,
By the Masses,
For the Masses,PERIOD#Prabhas pic.twitter.com/ykPsAi3l9n
— I’m Varma (@VarmaaVJ) May 2, 2022
Recommended Videos: