Prabhas- Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్… దేశం మొత్తం మారు మ్రోగుతున్న పేరు. అతి తక్కువ చిత్రాలతో ఈ యంగ్ డైరెక్టర్ టాప్ లోకి దూసుకొచ్చాడు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఖైదీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కేవలం ఒక నైట్ లో జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఖైదీ తెరకెక్కింది. హీరోయిన్, కామెడీ, సాంగ్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కార్తీతో వంద కోట్ల వసూళ్లు సాధించాడు లోకేష్. ఇక లేటెస్ట్ సెన్సేషన్ విక్రమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న విక్రమ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతుంది.

ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత 2022లో ఆ స్థాయి హిట్ సొంతం చేసుకుంది. ఐదు రోజుల్లో రూ. 200 కోట్లు దాటేసిన విక్రమ్… రన్ ముగిసే నాటికి 350 నుండి 400 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుతో పాటు విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది.
Also Read: Mahesh Babu: గుసగుస: ఆ హీరోతో పనిచేస్తే అంతేనా? వారి బరువు తగ్గాల్సిందేనా?
కాగా హీరో ప్రభాస్ తో లోకేష్ కనకరాజ్ మూవీ చేయాలని భావించారట. ప్రభాస్ ని కలిసిన లోకేష్ కనకరాజ్ ఓ స్టోరీ లైన్ వినిపించగా… ఆయన తిరస్కరించాడని కథనాలు వెలువడ్డాయి. కథ నచ్చక పోవడం వలనో, లోకేష్ పై నమ్మకం లేకో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపలేదన్న పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఒకవేళ ఇదే నిజమైతే విక్రమ్ హిట్ తో ప్రభాస్ థింకింగ్ మారిపోయి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. లోకేష్ మూవీ ఓకే చేయాల్సిందని ప్రభాస్ అనుకొనే అవకాశం కలదంటున్నారు.

మరోవైపు నెక్స్ట్ లోకేష్ హీరో విజయ్ తో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అలాగే కెజిఎఫ్ మాదిరి విక్రమ్ సిరీస్లో చిత్రాలు తెరకెక్కనున్నాయి. సూర్య చేసిన రోలెక్స్ సర్ రోల్ తో లోకేష్ సెకండ్ పార్ట్ కి లీడ్ వదిలారు. దాని ప్రకారం సెకండ్ పార్ట్ లో సూర్య విలన్ గా కనిపించే అవకాశం ఉంది. అదే నిజమైతే ఇండియాలోనే విక్రమ్ 2 అతిపెద్ద బ్లాక్ బస్టర్ కావచ్చు. ఏది ఏమైనా సౌత్ చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి.
Also Read:Johnny Depp: మాజీ భార్యపై కేసు గెలిచిన స్టార్ హీరో.. హోటల్ లో పార్టీ.. రూ.49 లక్షల బిల్!
[…] Also Read:Prabhas- Lokesh Kanagaraj: విక్రమ్ హిట్ తో ప్రభాస్ థిం… […]