Raja Saab Prabhas Remuneration : పాన్ ఇండియా మార్కెట్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల లిస్ట్ తీస్తే అందులో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) మొదటి స్థానం లో ఉంటాడు. ఒక్కో సినిమాకు ఆయన వంద కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. భారీ బడ్జెట్ సినిమా అయితే 150 కోట్ల రూపాయిల రేంజ్ లో కూడా ఆయన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంటాడు. అలాంటి ప్రభాస్ ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చనే నడుస్తోంది. కనీసం వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఆయన అందుకొని ఉంటాడని మీరంతా అనుకోని ఉండొచ్చు, కానీ ఆయన ఈ సినిమాకు ఇప్పటి వరకు తీసుకున్న రెమ్యూనరేషన్ కేవలం 45 కోట్ల రూపాయిలు మాత్రమేనట. అంత పెద్ద సూపర్ స్టార్ ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం ఏంటి అని మీకు అనిపించొచ్చు.
కానీ ఈ చిత్రం ప్రభాస్ కేవలం తన స్నేహితులు కోసమే చేస్తున్నాడట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు, ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ కూడా నిర్మిస్తోంది. ప్రభాస్ స్నేహితులు ఇందులో ఉన్నారు . ప్రస్తుతం ఈ సంస్థ నష్టాల్లో ఉంది, వరుసగా ఫ్లాప్స్ తో కోలుకోలేని విధంగా ఉండడం తో, తన స్నేహితుల కెరీర్స్ ని పైకి తీసుకొని రావాలనే ప్రభాస్ ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడట. అన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు పోతే ఈ సినిమా రెండేళ్ల క్రితమే విడుదల అయ్యి ఉండేది. కానీ VFX వర్క్ నిర్మాతకు నచ్చకపోవడం తో, వేరే కంపెనీ కి షిఫ్ట్ చేసి మరోసారి రీ వర్క్ చేయించాల్సి వచ్చింది. దీంతో బడ్జెట్ తారాస్థాయికి చేరింది. ఆ బడ్జెట్ తగ్గట్టే బిజినెస్ చెయ్యాలని చూస్తున్నాడు నిర్మాత విశ్వప్రసాద్. కానీ ఆ రేంజ్ బిజినెస్ మాత్రం జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
రెండేళ్ల క్రితం ఓటీటీ బిజినెస్ ప్రతీ సినిమాకు వేరే లెవెల్ లో ఉండేది. నిర్మాత పెట్టిన డబ్బులు కేవలం ఓటీటీ రైట్స్ నుండి వచ్చేసేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓటీటీ బిజినెస్ బాగా డౌన్ అయ్యింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా, నిర్మాత అడిగినంత రేట్ కి ఇచ్చే స్థానం లో లేరు. రాజా సాబ్ ఓటీటీ రైట్స్ కూడా ఇంకా అమ్ముడుపోలేదు. అదే విధంగా ఈ సినిమాకు బిజినెస్ అడ్వాన్స్ బేసిస్ మీద జరిగింది. ఒక్క ప్రాంతం లో కూడా అవుట్ రైట్ బిజినెస్ జరగలేదు. నిర్మాత రిస్క్ లోనే విడుదల చేస్తున్నాడు. ఇలాంటి సమయం లో ప్రభాస్ కూడా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం నిర్మాతకు కాస్త భారం తగ్గినట్టు అయ్యింది.