Raja Saab Movie : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కల్కి’ బాక్స్ ఆఫీస్ సునామీ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ప్రెస్టీజియస్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన ఈ సినిమాకి ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం రన్నింగ్ లో ఉన్న సమయంలోనే ప్రభాస్ నుండి ‘రాజా సాబ్’ మూవీ కి సంబంధించిన గ్లిమ్స్ ఇదేమో విడుదలైంది. ఈ గ్లిమ్స్ లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ ని చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రం నుండి వచ్చిన పోస్టర్స్, ప్రభాస్ పుట్టినరోజు నాడు విడుదలైన ప్రభాస్ సెకండ్ లుక్ మోషన్ పోస్టర్, ఇలా అన్నిటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని ఎంతో కసితో తీసాడని ప్రతీ ఒక్కరు అనుకున్నారు. ఏప్రిల్ 10వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో వెయ్యి కోట్ల రూపాయిల సినిమా అవుతుందని బలంగా నమ్మారు అభిమానులు.
ఎందుకంటే ఈమధ్య కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రాలు పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ నెలకొల్పుతున్నాయి. స్త్రీ2 అందుకు ఒక ఉదాహరణ. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. అలాంటి జానర్ లో ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని ఊహించడం కూడా కష్టమే. పైగా ఏప్రిల్ 10 వ తారీఖు మంచి డేట్, ఓపెనింగ్స్ కూడా భారీగా వస్తాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావడం లేదని, వాయిదా పడిందని అంటున్నారు. కారణం చాలా వరకు సినిమా బ్యాలన్స్ ఉండడమే. కాస్త బెటర్ ఔట్పుట్ కోసం వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉంది.
ఏప్రిల్ 10వ తేదీన మిస్ అయితే, ఈ చిత్రాన్ని ఆగష్టు 15 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఆగస్టు 14 వ తేదీన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వార్ 2’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా విడుదలైన రోజునే ‘రాజా సాబ్’ విడుదల చేస్తే సోలో సినిమాగా విడుదలైనప్పుడు వచ్చే లాభాలు రావని, భారీ ఓపెనింగ్స్ ఉండవని, దయచేసి మే 11న విడుదల చేయాలనీ మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, తమన్ సంగీత అందిస్తున్నాడు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసారు. త్వరలోనే ప్రభాస్ ‘సలార్ 2’, హను రాఘవపూడి తెరకెక్కించి సినిమాల్లో నటించబోతున్నాడు.