Prabhas Raja Saab movie hype: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు ప్రభాస్…మొదటి సినిమాతోనే నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న ఈయన అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ప్రస్తుతం పాన్ ఇండియా నేపద్యంలో ఏ హీరో చేయలేంతగా ఎక్కువ సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన హీరో కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో చేస్తున్న ‘రాజాసాబ్’ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాతో ఇండియాలో భారీ సక్సెస్ ని సాధిస్తానని ప్రభాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక తనతో పాటుగా తన ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా పీపుల్స్ మీడియా సంస్థ సైతం రీసెంట్ గా ‘మిరాయి’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న సినిమాలేమి ఆశించిన మేరకు విజయాలను సాధించకపోవడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొంతవరకు డీలాపడింది. మిరాయి సినిమాతో తమ స్టామినాను చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న రాజాసాబ్ సినిమా విషయంలో కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలుపుతున్నామంటూ చాలా స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 2026 జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు.
ఇక ఈ సినిమా కోసం తమన్ ఒక బాలీవుడ్ బాలీవుడ్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి…ఇక స్క్రీన్ ప్లే విషయంలో కానీ, మేకింగ్ సైడ్ కానీ మారుతి చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ రేంజ్ యాక్షన్స్ సన్నివేశాలను ఈ సినిమాలో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది.
అలాగే మారుతీ సైతం తన మార్క్ కామెడీని చూపిస్తూ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా మారుతి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియా డైరెక్టర్ గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును పొందుతాడు.లేకపోతే మాత్రం అతను చాలావరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…