https://oktelugu.com/

మెగాస్టార్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన కొరటాల !

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆచార్య’ సినిమా టీజర్ లో.. కొరటాల మార్క్ ఎక్కడో మిస్ అయిందనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య టీజర్ రిలీజ్ కావడం, ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోవడం, మెగాస్టార్ ఫ్యాన్స్ ను కూడా బాగా నిరాశ పరిచాయి. పాఠం గుణపాఠం అంటూ అవుట్ డేటెడ్ డైలాగ్స్ తో కొరటాల తన మార్క్ ను పూర్తిగా కోల్పోయాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 30, 2021 / 01:24 PM IST
    Follow us on


    భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆచార్య’ సినిమా టీజర్ లో.. కొరటాల మార్క్ ఎక్కడో మిస్ అయిందనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య టీజర్ రిలీజ్ కావడం, ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోవడం, మెగాస్టార్ ఫ్యాన్స్ ను కూడా బాగా నిరాశ పరిచాయి. పాఠం గుణపాఠం అంటూ అవుట్ డేటెడ్ డైలాగ్స్ తో కొరటాల తన మార్క్ ను పూర్తిగా కోల్పోయాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి, టీజర్ తో ఆచార్యకి వచ్చిన డామేజ్ ను కొరటాల ఎలా పోగొట్టుకుంటాడో చూడాలి.

    Also Read: ‘రాథేశ్వామ్’ కూడా రిలీజ్ కి సిద్ధం !

    పైగా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీగా పెట్టుబడి పెడుతున్నారు. కానీ ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి అంటూ టీజర్ మొదలై.. ప్రజానాయకుడు ప్రజల మధ్యలో నుంచే పుడతాడన్నట్లుగా పిడికిలి బిగిస్తూ ఎర్ర కండువాను ఎగరేస్తూ జన ప్రవాహం మధ్యలో నుంచి కెరటంలా మెగాస్టార్ టీజర్ లో కనిపించినా.. ఆ జోష్ అలాగే ఆ రేంజ్ హీరోయిజమ్ మాత్రం సినిమాలో బాగా మిస్ అయిపొయింది.

    Also Read: ప్రదీప్ లెక్కలు చూసి సినీ పెద్దలే షాక్ !

    అయితే ‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు’ అని చెర్రీ తన వాయిస్‌ ఓవర్‌ తో ఆకట్టుకున్నా.. మెగాస్టార్‌ తన ఎంట్రీతో పర్వాలేదనిపించినా మొత్తానికి కొరటాల మాత్రం ఫెయిల్ అయిపోయాడు. ముఖ్యంగా ‘పాఠాలు చెప్పకపోయినా అందరూ ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’ అన్న చిరు మెయిన్ డైలాగ్‌ కూడా పాత సినిమాల డైలాగ్ ను గుర్తుకు తెచ్చింది. టీజర్‌ రిలీజైందో లేదో క్షణాల్లోనే లక్షల వ్యూస్‌ రావాలి, అల వస్తోన్నా.. మెగాస్టార్ రేంజ్ లో మాత్రం టీజర్ కి ఆదరణ దక్కడం లేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్