Unstoppable: బాలయ్య నోట పుష్ప ‘తగ్గేదె లే’ డైలాగ్​.. అన్​స్టాపబుల్ కొత్త ప్రోమో రిలీజ్​

Unstoppable: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో బాలయ్య ఎంత సందడి చేస్తున్నారో తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ షో కు ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్​ రావిపూడి, అఖండ టీమ్​ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇటీవలే రాజమౌళి, కీరవాణి కూడా ఈ క్లబ్​లో చేరి ప్రేక్షకులను నవ్వులు పూయించారు. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 25, 2021 9:35 am
Follow us on

Unstoppable: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్​స్టాపబుల్​ షోతో బాలయ్య ఎంత సందడి చేస్తున్నారో తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ షో కు ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్​ రావిపూడి, అఖండ టీమ్​ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇటీవలే రాజమౌళి, కీరవాణి కూడా ఈ క్లబ్​లో చేరి ప్రేక్షకులను నవ్వులు పూయించారు.

https://twitter.com/ahavideoIN/status/1474388361548742660?s=20

మరోవైపు రవితేజను కూడా గెస్ట్​గా పిలిపించి.. అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసి ఆశ్చర్యపరిచారు బాలయ్య.. అయితే, తాజాగా, స్టైలిస్ట్​ స్టాల్ అల్లు అర్జున్​ను ఈ వేదికపైకి పిలిపించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోలో బన్నీతో పాటు పుష్ప అంటే ఫ్లవర్​ అనుకుంటివా.. ఫైర్​.. తగ్గేదె లే అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్​ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. దీంతో ప్రోమోనే ఈ రేంజ్​లో ఉంటే.. ఇక ఫుల్​ ఎపిసోడ్​ పవర్​ప్యాక్​ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఎపిసోడ్ డిసెంబరు 25న స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే ఈ ఎపిసోడ్​ విడుదల తేదీని ప్రకటించనున్నారు. కాగా, ఈ ఎపిసోడ్​లో బన్నీతో పాటు, పుష్ప హీరోయిన్​ రష్మిక, సుకుమార్ కూడా హాజరయ్యారు. మరి ఈ షో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.